News April 16, 2025
ఏపీకి చేరుకున్న 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు

AP: 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు విజయవాడకు చేరుకున్నారు. పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. రేపు సచివాలయంలో అమరావతి ఫొటో గ్యాలరీని వీరు తిలకించనున్నారు. అనంతరం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయంపై వీరితో సీఎం, మంత్రులు రేపు చర్చిస్తారు. రాత్రి తిరుపతికి వెళ్తారు. ఎల్లుండి స్థానిక ప్రజాప్రతినిధులు, వాణిజ్య, వ్యాపారులతో భేటీ అవుతారు.
Similar News
News April 16, 2025
‘సురానా’ కంపెనీలపై ఈడీ దాడులు

TG: హైదరాబాద్‌లోని సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సాయి సూర్య తేజ డెవలపర్స్ కంపెనీపై ఈడీ దాడులు చేసింది. సురానా కంపెనీ ఛైర్మన్, డైరెక్టర్ ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలో ఈ దాడులు చేపట్టింది. కాగా వీరిపై మనీలాండరింగ్‌తోపాటు విదేశాలకు హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. దీనిపై గతంలోనే కేసు నమోదైంది.
News April 16, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

రెండు రోజుల గ్యాప్ తర్వాత బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.88,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 990 పెరిగి రూ.96,170 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ. 200 పెరిగి రూ.1,10,000గా ఉంది.
News April 16, 2025
అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్

USలో చట్టవిరుద్ధంగా ఉంటూ సెల్ఫ్ డిపోర్టేషన్ (స్వీయ బహిష్కరణ) చేసుకునే వారికి ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. సాధారణ పౌరులు తమ సొంత దేశానికి వెళ్లేందుకు విమాన ఖర్చులతో పాటు కొంత నగదు ఇస్తామని తెలిపారు. అలా వెళ్లిన వారిలో మంచివారుంటే చట్ట పద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు. US నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపడమే ప్రథమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.