News April 16, 2025

‘సురానా’ కంపెనీలపై ఈడీ దాడులు

image

TG: హైదరాబాద్‌లోని సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌, సాయి సూర్య తేజ డెవలపర్స్‌ కంపెనీపై ఈడీ దాడులు చేసింది. సురానా కంపెనీ ఛైర్మన్, డైరెక్టర్ ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలో ఈ దాడులు చేపట్టింది. కాగా వీరిపై మనీలాండరింగ్‌తోపాటు విదేశాలకు హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. దీనిపై గతంలోనే కేసు నమోదైంది.

Similar News

News April 20, 2025

రేపు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

image

AP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా 51 మండలాల్లో <>వడగాలులు <<>>వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరంలో-16, మన్యం-11, శ్రీకాకుళం-4 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 20 చోట్ల వడగాలులు వీస్తాయంది. ఇవాళ నంద్యాల(D) ఔకులో 42.6 డిగ్రీలు, తిరుపతి(D) వెంకటగిరి, చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడులో 42.5 డిగ్రీలు, నెల్లూరు(D) మనుబోలులో 42.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.

News April 20, 2025

తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను: సీఎం చంద్రబాబు

image

AP: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినవారందరికీ CM చంద్రబాబు ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు అందించిన శుభాకాంక్షలు, చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. 75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాకు తోడునీడగా ఉండి, ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు.

News April 20, 2025

ఆయన వల్లే IPL సాధ్యమైంది: లలిత్ మోదీ

image

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వల్లే ఐపీఎల్ ఆలోచన కార్యరూపం దాల్చిందని లీగ్ ఫౌండర్ లలిత్ మోదీ చెప్పారు. తనను గుడ్డిగా నమ్మి ప్రోత్సహించడంతోనే ఐపీఎల్ కల నిజమైందని ఇన్‌స్టాలో ఆర్టికల్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు IPL లేకుండా క్రికెట్ ప్రపంచాన్నే ఊహించలేమన్నారు. పవార్ విజనరీని మరిచిపోవద్దన్నారు. శరద్ పవార్ 2005-08 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.

error: Content is protected !!