News April 16, 2025
పోలీసుల పనితీరులో దేశంలోనే తెలంగాణ టాప్

పోలీసు విభాగం పనితీరుకు సంబంధించి ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం తెలంగాణ 6.48 పాయింట్లతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఈ కేటగిరిలో 6.44Pతో ఏపీ రెండో స్థానం, 6.19Pతో కర్ణాటక మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదే విభాగంలో ప.బెంగాల్ చిట్టచివర నిలిచింది. జ్యుడీషియల్ ర్యాంకింగ్‌లో TGకి 2వ, APకి 5వ స్థానాలు దక్కాయి. అలాగే, ప్రిజన్స్ విభాగంలో ఏపీ 4వ, టీజీ 7వ స్థానంలో నిలిచాయి.
Similar News
News April 16, 2025
వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించలేం: సుప్రీం

వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు మధ్యంతర తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. అటు వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వానికి SC నోటీసులు జారీ చేసింది. కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలతో పాటు పలు ప్రశ్నలకు 2 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.
News April 16, 2025
యవ్వనంలోనే కీళ్లవాపును గుర్తించడమెలా?

వృద్ధాప్యంలో వచ్చే కీళ్లవాపు(ఆర్థరైటిస్)ను యవ్వనంలోనే గుర్తించొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాసేపు నడచిన లేదా పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకునే క్రమంలో కీళ్లలో నొప్పి రావడం, ఉదయం నిద్రలేచిన అరగంటకంటే ఎక్కువసేపు కండరాలు పట్టేసినట్లు ఉండటం, కీళ్ల చుట్టూ వాపు, తరచూ నీరసం, చేతుల్లో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు మున్ముందు రానున్న కీళ్లవాతానికి సూచనలని పేర్కొంటున్నారు.
News April 16, 2025
కాసేపట్లో వర్షం..

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి జల్లులు, గం.కు40KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. VKB జిల్లాల్లో మోస్తరు వర్షాలు, గం.కు40-61KM వేగంతో గాలులు వీస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. అటు 3 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.