News April 16, 2025
పోలీసుల పనితీరులో దేశంలోనే తెలంగాణ టాప్

పోలీసు విభాగం పనితీరుకు సంబంధించి ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం తెలంగాణ 6.48 పాయింట్లతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఈ కేటగిరిలో 6.44Pతో ఏపీ రెండో స్థానం, 6.19Pతో కర్ణాటక మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదే విభాగంలో ప.బెంగాల్ చిట్టచివర నిలిచింది. జ్యుడీషియల్ ర్యాంకింగ్‌లో TGకి 2వ, APకి 5వ స్థానాలు దక్కాయి. అలాగే, ప్రిజన్స్ విభాగంలో ఏపీ 4వ, టీజీ 7వ స్థానంలో నిలిచాయి.
Similar News
News April 17, 2025
రూ.10.75 కోట్ల ప్లేయర్.. బెంచ్‌కే పరిమితం

IPL: గత ఐదేళ్లు SRHకు కీలక బౌలర్‌గా ఉన్న నటరాజన్‌ను ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెగా ఆక్షన్‌లో DC రూ.10.75 కోట్లు వెచ్చించి అతడిని కొనుగోలు చేసినా బెంచ్‌కే పరిమితం చేస్తోంది. గాయం నుంచి కోలుకుని ఫిట్‌గా ఉన్నప్పటికీ తుది జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నటరాజన్ గత సీజన్‌లోనూ 19 వికెట్లతో సత్తాచాటారు.
News April 17, 2025
మేము హిందూస్ కానీ.. హిందీస్ కాదు: రాజ్ ఠాక్రే

జాతీయ భాష కాని హిందీని ప్రాథమిక తరగతిలోనే నేర్చుకోవాల్సిన అవసరమేముందని MNS చీఫ్ రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. మహారాష్ట్రలో NEPని అమలు చేయడాన్ని సహించేది లేదని ట్వీట్ చేశారు. తామంతా ‘హిందూస్ కానీ.. హిందీస్ కాదు’ అన్నారు. NEPని అమలు చేస్తే పోరాటం జరుగుతుందని ప్రభుత్వానికి ముందే తెలుసన్నారు. మరాఠీ, నాన్ మరాఠీ ప్రజల మధ్య గొడవలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందుదామని భావిస్తుందని ఆయన ఆరోపించారు.
News April 17, 2025
వారికి గౌరవ వేతనం పెంపు: మంత్రి ఫరూఖ్

ఏపీలో ప్రత్యేక మెజిస్ట్రేట్ల గౌరవ వేతనం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గౌరవ వేతనం రూ.45,000, రవాణా సౌకర్యాలకు మరో రూ.5వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 2019 ఏప్రిల్ 1 నుంచే ఇది వర్తిస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.