News March 27, 2024
ప్యాంట్ తడుపుకున్న CM.. నిజమేనా?

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లిక్కర్ స్కాం కేసులో ఆయనను ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళుతున్నప్పుడు కేజ్రీవాల్ ప్యాంట్ తడుపుకున్నట్లు ఆ ఫొటోలో ఉంది. అయితే అది ఎవరో కావాలనే ఎడిట్ చేసి, వైరల్ చేస్తున్నట్లు QuintFactCheck తేల్చింది. ఆ ఫొటో కూడా ఇప్పటిది కాదని, 2022లో ఆయన గుజరాత్ వెళ్లినప్పుడు తీసిందని వెల్లడించింది.
Similar News
News January 24, 2026
నెల్లూరు: బాల్యవివాహాల.. ఈ నంబర్‌కు ఫోన్ చేయండి

పొదలకూరు మండలం మొగళ్లూరు అంగన్‌వాడీ కేంద్రంలో ECCE డే సందర్భంగా బాల్యవివాహాల నివారణపై ఐసీడీఎస్ సీడీపీవో వి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్యవివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.18 ఏళ్లు నిండకముందే ఎక్కడైనా పెళ్లిలు జరుగుతుంటే టోల్‌ఫ్రీ నంబర్ 1098కి కాల్ చేయాలని తెలిపారు.
News January 24, 2026
స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్

T20 వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. భద్రతా కారణాల సాకుతో భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో ICC ఆ జట్టును తప్పించింది. దీంతో అత్యధిక ర్యాంకింగ్ ఉన్న <<18945385>>స్కాట్లాండ్<<>>కు అవకాశం దక్కింది. గ్రూప్ సీలో ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీతో తలపడనుంది. దీంతో స్కాట్లాండ్ మంచి ప్రదర్శన కనబరిస్తే టాప్-8కు చేరే ఛాన్స్ ఉంది. ఇది ఆ దేశానికి వరుసగా ఐదో T20 WC కావడం విశేషం.
News January 24, 2026
రేపు రథ సప్తమి.. ఇలా చేయండి

రథ సప్తమిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. రేపు సూర్యుడు ఉత్తరాయణ మార్గంలో ప్రయాణం ప్రారంభిస్తాడని పురాణాలు చెబుతాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః మంత్రాన్ని జపించాలి. బియ్యం, గోధుమలు, బెల్లం, గోధుమ పిండి, దుస్తులు దానం చేస్తే శుభాలనిస్తుంది. మాంసాహారం, మద్యం సేవించకూడదు. కోపం, చెడు మాటలకు దూరంగా ఉండాలి.


