News April 17, 2025

మహబూబాబాద్ జిల్లాలో పత్తి సాగు ప్రశ్నార్థకమేనా?

image

మహబూబాబాద్ జిల్లాలో పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవి చూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ప్యాకెట్ ధర రూ.710 ఉండగా ప్రస్తుతం 901కి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News August 13, 2025

ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు IOA ఆమోదం

image

2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ బిడ్డింగ్‌కు భారత ఒలింపిక్ సంఘం(IOA) ఆమోదం తెలిపింది. అవకాశం వస్తే అహ్మదాబాద్ వేదికగా ఈ క్రీడలు నిర్వహించాలని భారత్ యోచిస్తోంది. కాగా బిడ్డింగ్ దాఖలుకు ఆగస్టు 31 వరకు అవకాశం ఉంది. ఇదే సమయంలో నిర్వహణ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు కెనడా తాజాగా ప్రకటించడంతో భారత్‌కు అవకాశాలు మెరుగుపడ్డాయి.

News August 13, 2025

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం తేదీల ప్రకటన

image

AP: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 6న అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 7వ తేదీన సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ప్రకటించారు. అక్టోబర్ 14న జరిగే తెప్పోత్సవంతో జాతర ముగుస్తుందని తెలిపారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

News August 13, 2025

అంగన్‌వాడీల్లో ఆధునిక బోధన అవసరం: కలెక్టర్

image

అంగన్‌వాడీ సెంటర్లలో ఆధునిక బోధనా పద్ధతులు అనుసరించడం అత్యవసరమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. బుధవారం అమరావతి సచివాలయం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయం వెల్లడించారు. అంగన్‌వాడీల్లో ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన సూచించారు.