News March 28, 2024
ఆదాయంలో విజయవాడ రైల్వే డివిజన్ రికార్డు
AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా ₹3,975 కోట్ల రాబడి సాధించి విజయవాడ రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2018-19లో ₹3,875 కోట్ల ఆదాయం సాధించగా, ఇప్పుడు ఆ రికార్డు బ్రేకయ్యింది. సరకు రవాణాలో కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు తొలి 2 స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా 19.36 మి.టన్నుల బొగ్గు, 6.68 మి.టన్నుల ఎరువులను రవాణా చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News November 6, 2024
నేటి ముఖ్యాంశాలు
* తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్: రాహుల్
* రాహుల్ మాట ఇస్తే అది శాసనం: CM రేవంత్
* ఎల్లుండి నుంచి టెట్ దరఖాస్తు చేసుకోండి: TG విద్యాశాఖ
* రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది: కేటీఆర్
* సరస్వతి ప్లాంట్ ల్యాండ్స్ పరిశీలించిన పవన్ కళ్యాణ్
* వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది: అనిత
* హోంమంత్రి అనితను అవమానపర్చేలా పవన్ వ్యాఖ్యలు: మందకృష్ణ
News November 6, 2024
అమెరికా ఎన్నికలు.. ఆధిక్యంలో ఎవరంటే?
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు Real Clear Polling సైట్ తెలిపింది. పోలింగ్ ట్రెండ్స్ ప్రకారం ట్రంప్ 219, కమలా హారిస్ 211 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంది. స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, పెన్సిల్వేనియా, విస్కన్సిన్, ఆరిజోనా, మిచిగాన్, నార్త్ కరోలినా తదితర రాష్ట్రాల్లోని 108 ఓట్లు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది.
News November 6, 2024
స్వింగ్ స్టేట్‌కు నకిలీ బాంబు బెదిరింపులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. కీలకమైన ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ఒకటైన జార్జియాలోని ఫుల్టన్ కౌంటీలో ఐదు పోలింగ్ స్టేషన్లకు బెదిరింపులు వచ్చాయి. అయితే, వీటిని నకిలీవిగా తేల్చినట్టు కౌంటీ ఎన్నికల అధికారి నడైన్ విలియమ్స్ తెలిపారు. 5 స్టేషన్లలో రెండింటిని అరగంటపాటు ఖాళీ చేయించినట్టు ఆయన వెల్లడించారు. అనంతరం తిరిగి పోలింగ్ ప్రారంభించామని తెలిపారు.