News March 28, 2024
పదేళ్లలో రూ.5.3 లక్షల కోట్ల బ్యాంకు మోసాలు

2013-2023 మధ్య ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో 4.62 లక్షల మోసాలు జరిగినట్లు RBI వెల్లడించింది. పదేళ్లలో ₹5.3 లక్షల కోట్ల స్కామ్‌లు జరిగాయని RTI దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది. ‘రుణాలు, కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పద్ధతిలోనే ఎక్కువ మోసాలు జరిగాయి. మహారాష్ట్రలో అత్యధిక స్కామ్‌లు బయటపడగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, హరియాణా, తమిళనాడు, UP, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ ఉన్నాయి’ అని పేర్కొంది.
Similar News
News March 22, 2026
పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకండి: CM

TG: పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపాలనే మోజు నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని CM రేవంత్ సూచించారు. ‘వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తున్నాం. ఇవి నర్సరీ నుంచి ప్రారంభం అవుతాయి. పాలు, బ్రేక్‌ఫాస్ట్ కూడా అందిస్తాం. ప్రైవేట్ కంటే గవర్నమెంట్ టీచర్లే ప్రతిభావంతులు. అన్ని ప్రభుత్వ స్కూళ్లను ప్రక్షాళన చేస్తాం. అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా’ అని సిద్దిపేటలో తెలిపారు.
News March 22, 2026
ఘోరం.. తల్లి ముందే మైనర్ బాలికను..

నాసిక్ (MH) జ్యోతిషుడు <<19434630>>అశోక్ ఖరత్<<>> మైనర్లనూ వదల్లేదు. తల్లి ముందరే ఓ పాపను అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ప్రతికూల శక్తిని తొలగిస్తానంటూ టీషర్ట్‌ను పైకి ఎత్తమని కడుపు, ఛాతీని ఇంటర్నెట్ కేబుల్ టెస్టర్‌తో రుద్దాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియోను NCP (శరద్ పవార్ వర్గం) నేత రూపాలి రిలీజ్ చేశారు. కాగా అశోక్ పెన్ డ్రైవ్‌లో 100కు పైగా వీడియోలను పోలీసులు గుర్తించారు.
News March 22, 2026
24 ఏళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు: అమిత్ షా

అత్యధిక రోజులు సేవలు అందించిన ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ <<19447588>>రికార్డ్<<>> నెలకొల్పిన నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. 24ఏళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదని.. ఇది ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. ఇందుకే ప్రజలు ఆయనను మూడు సార్లు గుజరాత్ సీఎం, మూడు సార్లు భారత ప్రధానిని చేశారని తెలిపారు. మోదీ హయాంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.


