News March 28, 2024

2019లో భారీ మెజార్టీ.. ఇప్పుడు ఆత్మహత్య

image

తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి(77) <<12940065>>ఆత్మహత్య<<>> ఆ రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 2019 ఎన్నికల్లో ఆయన DMK నుంచి పోటీ చేసి 2.10 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగారు. నాలుగు రోజులుగా ప్రాణాలతో పోరాటం చేసి ఇవాళ గుండె పోటుతో తుది శ్వాస విడిచారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా ఆయనకు పేరుంది.

Similar News

News January 30, 2026

మేడారం జాతర.. నేడు సెలవు

image

TG: మేడారం జాతర సందర్భంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఉంటుందని అధికారులు ప్రకటించారు. దీనికి బదులుగా ఫిబ్రవరి 14న (రెండో శనివారం) పనిదినంగా పరిగణించనున్నట్లు తెలిపారు. కాగా జాతరకు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వెళ్లనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కాగా జాతర రేపటితో ముగియనుంది.

News January 30, 2026

ఈ నూనెలతో స్కిన్ సేఫ్

image

శీతాకాలం రాగానే చర్మం తన సహజతేమను కోల్పోయి పొడిబారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే మొక్కల నుంచి తీసిన నూనెలు వాడాలని సూచిస్తున్నారు నిపుణులు. వీటిలోని ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మంపై రక్షణ కవచంలా ఏర్పడతాయి. ముఖ్యంగా జొజొబా ఆయిల్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, రోజ్‌షిప్ ఆయిల్, కొబ్బరి నూనెలు చర్మాన్ని సంరక్షించడంలో కీలకంగా పనిచేస్తాయంటున్నారు.

News January 30, 2026

కొబ్బరి సాగు.. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు

image

☛ డబుల్ సెంచరీ: ఇది పొడుగు కొబ్బరి రకం. నాటిన ఆరేళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 130 కాయల దిగుబడి వస్తుంది. ఈ రకం కొబ్బరిలో నూనె దిగుబడి 64 శాతం.
☛ గోదావరి గంగ: ఇది హైబ్రిడ్ కొబ్బరి రకం. నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 140-150 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 68 శాతం. ఇవి కొబ్బరి బొండానికి, టెంకాయకు మేలైన రకాలు.