News March 28, 2024
హిందూపురం నుంచి కదలను: పరిపూర్ణానంద

AP: హిందూపురం నుంచి కదిలే ప్రసక్తే లేదంటున్నారు పరిపూర్ణానంద స్వామిజీ. టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా హిందూపురం ఎంపీ, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు. స్వామీజీ అయిన తనకు టికెట్ ఇస్తే ముస్లింల ఓట్లు పోతాయని చంద్రబాబు బీజేపీ పెద్దలకు చెప్పారని తెలిపారు. ముస్లింల ఓట్ల కోసం జనాభాలో ఎక్కువ శాతం ఉన్న హిందువుల ఓట్లు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
Similar News
News April 8, 2026
పీ&కే ఎరువులపై ₹41,534కోట్ల రాయితీకి కేంద్రం ఆమోదం

ఖరీఫ్ సీజన్‌లో పీ అండ్ కే ఎరువులపై ₹41,534 కోట్ల రాయితీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 మధ్య ఖరీఫ్ సీజన్‌కు ఈ సబ్సిడీ అమలులో ఉంటుందని పేర్కొంది. డై-అమ్మోనియమ్ ఫాస్పేట్ (DAP) ధరలు అంతర్జాతీయంగా పెరిగినా రైతులపై భారం పడకుండా ఉండేందుకు ధరలలో మార్పులు చేయలేదని వెల్లడించింది. దీంతో 50కిలోల బ్యాగ్ ధర ₹1,350గా కొనసాగనుంది.
News April 8, 2026
శబరిమలకు మహిళల ప్రవేశంపై SC Vs కేంద్రం

శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య మహిళల ప్రవేశంపై ఆంక్షల కేసులో SC కీలక వ్యాఖ్యలు చేసింది. మతాల్లోని మూఢవిశ్వాసాలను ఎత్తిచూపే హక్కు తమకు ఉందంది. జడ్జీలు న్యాయరంగంలో మాత్రమే నిపుణులని.. మతం, సంప్రదాయాలపై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించడం సరికాదన్న కేంద్రం వాదనలపై ఇలా రియాక్ట్ అయింది. కాగా 2018లో మహిళలందరికీ ప్రవేశం కల్పిస్తూ తీర్పు వచ్చినా రివ్యూ పిటిషన్ల వల్ల 10-50 ఏళ్ల వారికి అనుమతి నిలిచిపోయింది.
News April 8, 2026
పవన్‌లో కర్మయోగిని చూశా: డైరెక్టర్ బాబీ

AP Dy.CM పవన్‌ను డైరెక్టర్ బాబీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన(సర్దార్ గబ్బర్ సింగ్) జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ‘ఆస్తులు పెంచుకోవడమే రాజకీయం అనుకునే ఈ రోజుల్లో ప్రజా సేవ కోసం రాజభోగాలను, సుఖాలను వదులుకొని శ్రమిస్తున్న ఋషి పవన్ కళ్యాణ్. జ్ఞానం కోసం అడవికి వెళ్లిన బుద్ధుడిని చరిత్రలో చదివాం. జనం కోసం నిరంతరం తపించే కర్మయోగిని ఇవాళ కళ్లారా చూశా’ అని కొనియాడారు.


