News March 28, 2024

హిందూపురం నుంచి కదలను: పరిపూర్ణానంద

image

AP: హిందూపురం నుంచి కదిలే ప్రసక్తే లేదంటున్నారు పరిపూర్ణానంద స్వామిజీ. టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా హిందూపురం ఎంపీ, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు. స్వామీజీ అయిన తనకు టికెట్ ఇస్తే ముస్లింల ఓట్లు పోతాయని చంద్రబాబు బీజేపీ పెద్దలకు చెప్పారని తెలిపారు. ముస్లింల ఓట్ల కోసం జనాభాలో ఎక్కువ శాతం ఉన్న హిందువుల ఓట్లు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

Similar News

News February 18, 2026

రోజూ హ్యాండ్ బ్యాగ్ వాడుతున్నారా?

image

హ్యాండ్ బ్యాగ్ కొందరికి అవసరం. కానీ దాంట్లో అనవసరమైన వస్తువులు పెట్టి దాన్ని బరువుగా మారుస్తున్నారు చాలామంది. దాన్ని స్టైల్​గా చేత్తో పట్టుకోవడమో, భుజానికి వేసుకోవడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో కండరాలు, ఎముకలపై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు పోశ్చర్ మారిపోతుంది. కాబట్టి బ్యాగును చేతులు మారుస్తూ పట్టుకోవడం, లగేజ్ ఎక్కువగా ఉంటే బ్యాక్ ప్యాక్ వాడటం మంచిదని సూచిస్తున్నారు.

News February 18, 2026

YouTube డౌన్

image

ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్, డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు. యాక్సెస్ చేయాలని చూస్తుండగా ‘Something went wrong’ అని చూపిస్తోంది. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో యూట్యూబ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మీకూ ఇలాగే అవుతోందా? మరోవైపు అంతరాయంపై పేరెంట్ కంపెనీ గూగుల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

News February 18, 2026

మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకుంటే…

image

TG: పరిషత్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చిక్కొచ్చి పడింది. మార్చి 15లోపు ఎలక్షన్స్ నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోనున్నాయి. అంతకుముందు నిర్వహిద్దామంటే టెన్త్ ప్రీఫైనల్స్‌, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సర్కార్ తర్జనభర్జన పడుతోంది. ఈ నెల 23న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయానికి రానుంది.