News April 23, 2025

పహల్గాం దాడి కలచివేసింది: ట్రంప్

image

J&K పహల్గాం దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. ‘చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రధాని మోదీకి, భారతీయులకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మీకు మా ప్రగాఢ సంతాపం’ అని తెలిపారు.

Similar News

News August 7, 2025

దూర ప్రయాణాలు చేసే వారి కోసం త్వరలో ఎమినిటీ సెంటర్లు!

image

దేశవ్యాప్తంగా నేషనల్ హైవేల పక్కన 5వేల వేసైడ్ ఎమినిటీ(WSA) సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దూర ప్రయాణాలు చేసే వారు, భారీ వాహనాల డ్రైవర్లు వీటిలో విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రతి 30-40kmsకి ఒకటి చొప్పున ఏర్పాటు కానున్నాయి. ఈ కేంద్రాల్లో పార్కింగ్ స్థలం, ఫుడ్, ఫ్యూయెల్, టాయిలెట్లు వంటి సదుపాయాలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం గత వారం విడుదల చేసింది.

News August 7, 2025

జిల్లాల్లో మార్పులపై నెలలో నివేదిక: CM

image

APలో కొత్త జిల్లాలు, మండలాలు, సరిహద్దుల మార్పులపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని CM చంద్రబాబు ఆదేశించారు. సరిహద్దు మండలాల విలీన సమస్యకు పరిష్కారం, కొత్త మండలాలు ఏర్పాటు, జిల్లా, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు మార్పు వంటి వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు. అక్టోబర్ ఆఖరులోపే ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.

News August 7, 2025

రాజగోపాల్‌ రెడ్డికి నోటీసులు?

image

TG: సీఎం రేవంత్ రెడ్డిపై పదేపదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజగోపాల్‌ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి భేటీ కానున్నారు. రేవంత్‌పై విమర్శల మీద వివరణ కోరనున్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.