News April 23, 2025
పహల్గాం దాడి కలచివేసింది: ట్రంప్

J&K పహల్గాం దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. ‘చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రధాని మోదీకి, భారతీయులకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మీకు మా ప్రగాఢ సంతాపం’ అని తెలిపారు.
Similar News
News April 18, 2026
ఎండలు పెరుగుతున్నాయ్ జాగ్రత్త: కలెక్టర్ చంద్రశేఖర్

జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వేసవి కార్యాచరణపై సమీక్షించారు. రానున్న 3 నెలలు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నెం. 18004251422, వాట్సాప్ నెం. 6305951279 అందుబాటులో ఉంటాయన్నారు.
News April 18, 2026
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
*అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు
*రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టాం: రాహుల్
*విపక్షాలపై అమిత్ షా, చంద్రబాబు, వైఎస్ జగన్ ఫైర్
*రేపు దేశవ్యాప్తంగా నిరసనలకు NDA పిలుపు
*హార్ముజ్ ఓపెన్ చేశాం: ఇరాన్
*అంబానీని దాటేసి.. ఆసియా కుబేరుడిగా అదానీ
News April 18, 2026
GT vs KKR.. ఎవరు గెలిచారంటే?

IPL-2026లో KKRకు మరో ఓటమి ఎదురైంది. కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గిల్ 86 పరుగులతో రాణించారు. అంతకుముందు గ్రీన్ 79 రన్స్ చేయడంతో కేకేఆర్ 180 పరుగులు చేయగలిగింది. ఇది GTకి మూడో విజయం కాగా, KKRకు 5వ ఓటమి.


