News April 23, 2025
HYDలో నేడు ఎన్నికలు.. BJP VS MIM

GHMC హెడ్ ఆఫీస్‌లో నేడు స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. MIM నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, BJP నుంచి గౌతంరావు బరిలో ఉన్నారు. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. MIMకు 50 ఓట్లు, BRSకు 24, BJPకి 24, INCకు 14 ఓట్లు ఉన్నాయి. 22 ఏళ్ల తర్వాత ఈ ఎన్నిక జరగడం, INC, BRS పోటీ చేయకపోవడంతో గ్రేటర్ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. APR 25న లెక్కింపు జరగనుంది.
Similar News
News April 23, 2025
పది ఫలితాలలో 13 నుంచి 8వ స్థానానికి ఎన్టీఆర్ జిల్లా

2024- 25లో పది పరీక్షల ఫలితాలలో రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా 8వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 88.76% ఉత్తీర్ణత శాతంతో 13వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడు 5 స్థానాలు మెరుగుపరుచుకుని 8వ స్థానానికి చేరుకుంది. జిల్లాలో 27,467 మంది పరీక్షలు రాయగా 23,534(85.68) మంది పాసయ్యారు. మండలాలవారీగా ఉత్తీర్ణత శాతం తెలియాల్సి ఉంది.
News April 23, 2025
HNK: ఇంటర్ ఫలితాల్లో ‘వేలేరు గురుకులం’ విజయదుందిబి!

ఇంటర్మీడియట్ ఫలితాల్లో HNK జిల్లా వేలేరు గురుకుల కళాశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి విజయదుందుబి మోగించారు. ఎంపీసీలో నందకిషోర్ 986/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. బైపీసీలో రాహుల్‌కు 980/1000 మార్కులు లభించాయి. ఎంపీసీలో సాయి గణేశ్ 464/470 మార్కులు, బైపీసీలో శశాంత్ 420/440 మార్కులు సాధించారు. విద్యార్థులను, స్టాఫ్‌ను ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ కుమార్ అభినందించారు.
News April 23, 2025
ఉమ్మడి ప.గో జిల్లాలో 10Th ఉత్తీర్ణత శాతం ఇలా..

10వ తరగతి ఫలితాల్లో ఉమ్మడి ప.గో. జిల్లా విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గతేడాదితో పోల్చితే ఈసారి ప.గో.జిల్లా మెరుగుపడగా ఏలూరు జిల్లా కాస్త తగ్గింది. ➤ ప.గో.జిల్లాలో గతేడాది 81.82% ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది 82.15% శాతంతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. ➤ ఏలూరు జిల్లా విద్యార్థులు గతేడాది 80.08% శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. ఈ ఏడాది 77.24% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది.