News April 23, 2025
HYDలో నేడు ఎన్నికలు.. BJP VS MIM

GHMC హెడ్ ఆఫీస్‌లో నేడు స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. MIM నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, BJP నుంచి గౌతంరావు బరిలో ఉన్నారు. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. MIMకు 50 ఓట్లు, BRSకు 24, BJPకి 24, INCకు 14 ఓట్లు ఉన్నాయి. 22 ఏళ్ల తర్వాత ఈ ఎన్నిక జరగడం, INC, BRS పోటీ చేయకపోవడంతో గ్రేటర్ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. APR 25న లెక్కింపు జరగనుంది.
Similar News
News April 16, 2026
NTR ‘డ్రాగన్’ మూవీ ఈ ఏడాది రిలీజయ్యేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమా విడుదలపై ఓ షాకింగ్ వార్త వైరలవుతోంది. ఈ ఏడాది జూన్‌లో సినిమా వస్తుందని గతంలో ప్రకటించగా.. షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉండటంతో అది సాధ్యం కాదని సినీవర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కావచ్చని తెలిపాయి. కాగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి ‘డ్రాగన్’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి.
News April 16, 2026
ప్రాణ రక్షణకు హెల్మెట్ ధరించండి: డీజీపీ

బాలానగర్ మండలం పెద్దాయపల్లి చౌరస్తాలో గురువారం అరైవ్ – అలైవ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీపీ శివధర్ రెడ్డి హాజరయ్యారు. DGP మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకోవాలన్నారు. ఎస్పీ జానకి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.
News April 16, 2026
ఒక్క మిస్సైల్‌తో.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

హార్ముజ్ జలసంధిపై పట్టు కోసం ప్రయత్నిస్తే అమెరికా నౌకలను మిస్సైల్స్‌తో కూల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమ మొదటి మిస్సైల్ దాడికే US యుద్ధ నౌకలు సముద్రంలో మునిగిపోతాయని ఇరాన్ సుప్రీం నేత సలహాదారు మోహ్‌సేన్ రెజాయి అన్నారు. ఒకవేళ అమెరికా గ్రౌండ్ అటాక్‌కు దిగితే ఆ దేశ సైనికులను బందీలుగా పట్టుకుంటామన్నారు. ఒక్కో సైనికుడిని విడిపించేందుకు ఒక బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.


