News March 28, 2024
ఉద్యోగ నియామక పరీక్ష వాయిదా

తెలంగాణ జెన్‌కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల పరీక్ష వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా ఈనెల 31న జరగాల్సిన పరీక్షను జెన్‌కో వాయిదా వేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది.
Similar News
News March 18, 2026
ఆ కళ్లద్దాలతో న్యూడ్, బెడ్‌రూమ్ దృశ్యాలు రికార్డ్!

మెటా AI స్మార్ట్ గ్లాసెస్ వినియోగదారుల అత్యంత వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్ చేసి కెన్యాలోని రివ్యూయర్లకు పంపిస్తున్నట్లు స్వీడిష్ పత్రికల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. దాని ప్రకారం.. న్యూడ్, బెడ్‌రూమ్, బాత్‌రూమ్ దృశ్యాలతో పాటు బ్యాంక్ కార్డుల వివరాలు అక్కడి సిబ్బందికి చేరుస్తున్నాయి. బ్లర్ చేసే టెక్నాలజీ పనిచేయక వ్యక్తుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో మెటాపై క్లాస్ యాక్షన్ దావా నమోదైంది.
News March 18, 2026
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

TG: మూసీ ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం జరిగింది. మూసీ గురించి సభలో ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెబుతోందని KTR మండిపడ్డారు. సర్కార్ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ ఆ పార్టీ సభ్యులతో కలిసి బయటికి వెళ్లిపోయారు. అయితే BRSకు మూసీ ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధి లేదని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశమే వారికి లేదన్నారు.
News March 18, 2026
రేపే ఉగాది.. ఇలా చేస్తే మంచిది!

తెలుగు క్యాలెండర్ ప్రకారం ‘శ్రీ పరాభవ నామ’ సంవత్సరం రేపు ప్రారంభంకానుంది. ఇది గతాన్ని విశ్లేషించుకొని కొత్త విజయాల వైపు సాగాలని సూచిస్తుంది. సూర్యోదయానికి ముందే స్నానాలు ఆచరించి, ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. పంచాంగ శ్రవణం వినడం వల్ల నూతన సంవత్సర రాశిఫలాలు, గ్రహాల ప్రభావం తెలుస్తుంది. గుమ్మాలకు పసుపు, కుంకుమ రాసి ముగ్గులు వేయాలి. ఇష్ట దైవానికి పూజ చేసి దానం చేయడం శుభప్రదం. SHARE IT


