News March 28, 2024

ఉద్యోగ నియామక పరీక్ష వాయిదా

image

తెలంగాణ జెన్‌కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల పరీక్ష వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా ఈనెల 31న జరగాల్సిన పరీక్షను జెన్‌కో వాయిదా వేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది.

Similar News

News February 14, 2026

C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(C-DOT)లో 10 సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech, MSc, ME/MTech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్కిల్/ రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdot.in.

News February 14, 2026

శివరాత్రికి రాత్రిపూట పూజ ఎందుకు?

image

పగలు లౌకిక పనులకు, రాత్రి ఆధ్యాత్మిక సాధనకు సంకేతం. శివరాత్రి నాటి లింగోద్భవ కాలం శక్తిమంతమైనది. చీకటి అజ్ఞానానికి ప్రతీక. అయితే శివుడు జ్ఞాన జ్యోతి. రాత్రంతా మేల్కొని చేసే జాగరణ మనలోని తమస్సును తొలగించి పరమాత్మ వైపు నడిపిస్తుంది. మనసు చంద్రునిపై ఆధారపడి ఉంటుంది. నేడు చంద్రుడు క్షీణించి ఉంటాడు. అంటే మనసు అదుపులో ఉంటుంది. ఆ సమయంలో చేసే శివారాధన ఇంద్రియాలను జయించి, శివత్వాన్ని పొందేలా చేస్తుంది.

News February 14, 2026

అధిక తేమ ముప్పు పంటలకు తప్పాలంటే?

image

నీరు నిల్వ ఉండే భూమి కాకుండా ఇసుక మిశ్రమంగల భూములను ఎంచుకోవాలి. పంట మొక్కల మధ్య తగిన దూరం ఉండాలి. దీని వల్ల గాలి, వెలుతురు ప్రసరించి తేమ సమస్య తగ్గుతుంది. పొలాలకు తప్పనిసరిగా మురుగునీరు బయటకు పోయే కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. భారీ వర్షాల సమయంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. సేంద్రియ ఎరువుల వాడకంతో నేల నిర్మాణం మారుతుంది. ప్లాస్టిక్ లేదా సేంద్రియ మల్చింగ్ ద్వారా తేమను నియంత్రించవచ్చు.