News April 23, 2025
ఆ సమయంలో ఫోన్ వాడకండి!

వేసవి కావడంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు పేలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం నిత్యం వాడే సెల్‌ఫోన్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వేడికి ఫోన్లు ఓవర్ హీట్ అవుతాయి. ఆ సమయంలో మొబైల్‌కు అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది. అప్పుడు ఫోన్ వాడకూడదు. చల్లగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్లి, బ్యాటరీ కూల్ అయ్యాకే వినియోగించాలి.
Similar News
News April 19, 2026
ట్రంప్-మునీర్ మైత్రి: అమెరికాకే ప్రమాదం!

ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఎంచుకోవడాన్ని అమెరికా రక్షణ నిపుణులు తప్పుబడుతున్నారు. ఇరాన్ సైన్యం, నిఘా సంస్థలు, IRGC నేతలతో ఆయనకు ఏళ్ల నుంచి ఉన్న సంబంధాలే ఇందుకు కారణం. గతంలో అఫ్గాన్ విషయంలో మిత్రదేశంగా నటిస్తూనే తాలిబన్లకు సహకరించిన పాక్ ద్వంద్వ నీతిని మరువరాదని, మునీర్‌ను నమ్మడం వల్ల US వ్యూహాత్మక రహస్యాలు ఇరాన్ చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
News April 19, 2026
కీవ్ సూపర్ మార్కెట్‌లో కాల్పులు.. ఆరుగురి మృతి!

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కీవ్‌లోని హోలోసివ్స్కీ జిల్లాలో వీధిలో వెళ్తున్న వారిపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం సూపర్ మార్కెట్‌లోకి దూరి కొంతమందిని బందీలను చేసుకున్నాడు. సుమారు 40 నిమిషాల ఉత్కంఠ తర్వాత ప్రత్యేక దళాలు (KORD) జరిపిన ఆపరేషన్‌లో నలుగురు బందీలను విడిపించారు. దుండగుణ్ని కాల్చి చంపారు.
News April 19, 2026
ఏప్రిల్ 19: చరిత్రలో ఈరోజు

1882: జీవ పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్ మరణం.
1912: నోబెల్ గ్రహీత, అమెరికా రసాయన శాస్త్రవేత్త గ్లెన్ సీబోర్గ్ జననం.
1957: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ (ఫొటోలో) జననం.
1971: మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం.
1975: భారత్ తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం
2006: స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న మరణం.


