News April 23, 2025
ఆ సమయంలో ఫోన్ వాడకండి!

వేసవి కావడంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు పేలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం నిత్యం వాడే సెల్‌ఫోన్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వేడికి ఫోన్లు ఓవర్ హీట్ అవుతాయి. ఆ సమయంలో మొబైల్‌కు అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది. అప్పుడు ఫోన్ వాడకూడదు. చల్లగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్లి, బ్యాటరీ కూల్ అయ్యాకే వినియోగించాలి.
Similar News
News April 17, 2026
వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌పై కేసు

ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్ బాయిలర్ పేలుడు <<19650757>>ఘటన<<>>లో మృతుల సంఖ్య 20కి చేరింది. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌తో పాటు ప్లాంట్ మేనేజర్‌పై FIR నమోదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం, భద్రతా లోపాల వల్లే ఇంతమంది ప్రాణాలు పోయాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.
News April 17, 2026
తిరుమలలో సహస్ర నామార్చన ఆంతర్యం

తిరుమల శ్రీవారి ఆలయంలో తోమాలసేవ తర్వాత జరిగే ముఖ్య కైంకర్యం సహస్ర నామార్చన. ఇందులో స్వామివారిని 1008 నామాలతో పూజిస్తారు. ఈ నామాల ద్వారా శ్రీమహావిష్ణువు సకల వైభవాలను కీర్తిస్తారు. సకల దుఃఖాలను తొలగించేది, శుభాలను ప్రసాదించేది శ్రీమహావిష్ణువే అనే భావనతో ఈ అర్చన జరుగుతుంది. భక్తులు ఆర్జితసేవ టికెట్ల ద్వారా ఈ పవిత్రమైన అర్చనలో పాల్గొని, స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు.
News April 17, 2026
BREAKING: తగ్గిన బంగారం ధర

కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు అక్షయ తృతీయ ముంగిట తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,370 తగ్గి రూ.1,54,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,250 పతనమై రూ.1,41,350 పలుకుతోంది. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,75,000గా ఉంది.


