News April 24, 2025
వరంగల్లో లొంగిపోయిన 14మంది మావోయిస్టులు

TG: వరంగల్లో 14మంది మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ‘మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తున్నాం. అది మంచి ఫలితాల్ని ఇస్తోంది. ఈ ఏడాది 250మంది లొంగిపోయారు. వారికి రూ.25 వేలు అందిస్తున్నాం. ఏ రాష్ట్రానికి చెందిన వారు లొంగిపోయినా మా సహకారం అందిస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.
Similar News
News April 24, 2025
IPL: ఆర్సీబీ స్కోర్ ఎంతంటే?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RRతో జరిగిన మ్యాచ్లో RCB 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(70), దేవదత్ పడిక్కల్(50) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 26 పరుగులతో శుభారంభం అందించారు. చివర్లో టిమ్ డేవిడ్(23), జితేశ్ శర్మ(20*) బౌండరీలతో మెరిపించారు. సందీప్ శర్మ 2 వికెట్లు తీశారు. RR టార్గెట్ 206.
News April 24, 2025
నాయీ బ్రాహ్మణుల కమీషన్ పెంపు

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులకు కనీస కమీషన్ను రూ.20వేల నుంచి రూ.25వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 6ఏ కేటగిరీలోని 44 దేవాలయాల్లో పనిచేస్తున్న వారికి వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. కనీసం ఆలయాల్లో 100 రోజుల పాటు సేవలు అందించేవారికి ఈ పెంపు వర్తించనుంది. ఏడాదికి రూ.50లక్షల నుంచి రూ.2 కోట్లు ఆదాయం వచ్చే ఆలయాలు 6A కేటగిరీలోకి వస్తాయి.
News April 24, 2025
యుద్ధానికి సిద్ధమవుతోన్న పాక్!

భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న PAK కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగా LOCకి అటువైపు ఆర్మీ దళాలను భారీగా మోహరిస్తోంది. కేవలం బంకర్ల నుంచే నిఘా ఉంచాలని సైనికులను ఆదేశించింది. రావల్పిండి కేంద్రంగా పని చేస్తున్న 10దళాల సైనికులను అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని PAK ఆర్మీ ఆదేశించింది. LOCతో పాటు అంతర్జాతీయ సరిహద్దులైన సియాల్కోట్, గుజ్రాన్వాలా వద్ద ఉన్న సైనికులనూ అలర్ట్ చేసింది.