News March 28, 2024
బీఆర్ఎస్‌కు BIG SHOCK

BRSకు మరో షాక్ తగిలింది. వరంగల్ ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు BRS అభ్యర్థి కడియం కావ్య ప్రకటించారు. ఈమేరకు ఆమె పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. ‘కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం విషయాలు పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయి. నాయకుల మధ్య సమన్వయం లోపించింది. ఈ పరిస్థితుల్లో పోటీ చేయలేను’ అని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News March 22, 2026
చచ్చిపోవచ్చుగా అన్నారు: వరుణ్

తన IPL కెరీర్‌లో 2021 సీజన్ దారుణంగా గడిచిందని KKR స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గుర్తుచేసుకున్నారు. ‘అప్పట్లో కొవిడ్ సోకిన తొలి ఆటగాడిని నేనే. ఆ తర్వాత సందీప్ వారియర్‌కూ వచ్చింది. దీంతో టోర్నీని వాయిదా వేయాల్సి వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఆగిపోవడంతో అభిమానులు కోపంతో నన్ను తిట్టారు. చచ్చిపోవచ్చుగా అన్నారు’ అని ఓ షోలో చెప్పారు. కాగా ఆ ఏడాది IPL రెండో దశను UAEలో నిర్వహించిన విషయం తెలిసిందే.
News March 22, 2026
ఏప్రిల్ నుంచి లైసెన్స్‌కు మూడు పరీక్షలు?

TG: రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు లైసెన్స్ జారీలో త్రీ టైర్ సిస్టమ్ తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం LLR, పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు మరో టెస్ట్‌ను యాడ్ చేయనుంది. LLR పరీక్ష కన్నా ముందు ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు గంటల నిడివిగల ఈ పరీక్షలో ఆరు పార్టులు ఉంటాయి.
News March 22, 2026
ఆదిత్య ధర్ క్రికెట్ వదిలేయడానికి కారణం ఇదే!

‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ భారత్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్నారు. తనకు 2002 అండర్-19 WCలో చోటు పక్కా అనుకున్నారు. కానీ అనూహ్యంగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీని సెలక్ట్ చేశారు. గొప్ప ఫామ్‌లో ఉన్న తనకు ఛాన్స్ ఇవ్వకుండా రాజకీయాలు చేశారని క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి సినిమాల్లోకి వచ్చారు. కాగా బిన్నీ ఆ టోర్నమెంటులో 6 మ్యాచుల్లో 34 రన్స్ మాత్రమే చేశారు.


