News March 28, 2024
IPL: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు

ఈరోజు జైపూర్‌లో రాజస్థాన్, ఢిల్లీకి మధ్య జరిగిన ఐపీఎల్ పోరులో రాజస్థాన్ గెలుపొందింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితమైంది. వార్నర్(49), స్టబ్స్(44) రాణించినా ఫలితం లేకపోయింది. RR బౌలర్లలో బర్గర్, చాహల్ చెరో రెండు వికెట్లతో రాణించారు.
Similar News
News April 3, 2026
కవిత తన పార్టీకి TRS పేరు పెడతారా?

TG: కొత్త పార్టీ పెట్టనున్న వేళ HYD ప్రెస్‌మీట్లో జాగృతి అధ్యక్షురాలు కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. TRS పేరు ఫ్రీ అయిందని, ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చన్నారు. తాము పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తున్నామని తెలిపారు. దీంతో తన పార్టీకి TRS పేరు పెట్టనున్నారా? అనే చర్చ మొదలైంది. కానీ ఇప్పటికే కవిత పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.
News April 3, 2026
చద్దాను సైలెంట్ చేయడానికి కారణాలివేనా?

రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తప్పించడానికి బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా పార్టీ విషయాలపై ఆయన మౌనం వహిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ నిర్దోషి అని తేలాక జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. అలాగే పంజాబ్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, రాజ్యసభలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆప్ వర్గాలు ఆరోపించాయి.
News April 3, 2026
అమరావతిపై 2-3 రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు బిల్లును ఆమోదించాయి. పార్లమెంటు సెక్రటేరియట్ నుంచి హోం శాఖకు ఈ బిల్లు ప్రతులు చేరాయి. బిల్లును హోంశాఖ 2, 3 రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనుంది. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే చట్టంగా మారుతుంది. ఆపై కేంద్రం దానిపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అనంతరం అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధ రాజధాని కానుంది.


