News March 28, 2024

IPL: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు

image

ఈరోజు జైపూర్‌లో రాజస్థాన్, ఢిల్లీకి మధ్య జరిగిన ఐపీఎల్ పోరులో రాజస్థాన్ గెలుపొందింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితమైంది. వార్నర్(49), స్టబ్స్(44) రాణించినా ఫలితం లేకపోయింది. RR బౌలర్లలో బర్గర్, చాహల్ చెరో రెండు వికెట్లతో రాణించారు.

Similar News

News January 20, 2025

ఈ నెల 28 నుంచి నాగోబా జాతర

image

TG: రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన ఆదివాసుల పండగ నాగోబా జాతర ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో జరిగే ఈ జాతరకు వేదపండితులు, దేవదాయశాఖ అధికారులు మంత్రి కొండా సురేఖను కలిసి ఆహ్వానం పలికారు. ఈ జాతరకు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆదివాసులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.

News January 20, 2025

పేరుకే ‘పెద్దన్న’.. జీతం వారికన్నా తక్కువే

image

పెద్దన్నగా పేరొందిన అమెరికా అధ్యక్షుడి జీతం పలు దేశాధినేతల కంటే తక్కువే. యూఎస్ అధ్యక్షుడి గౌరవ వేతనం ఏడాదికి రూ.4 లక్షల డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3.46 కోట్లు. సింగపూర్ ప్రధాని జీతం ఏడాదికి సుమారు రూ.13.85 కోట్లు, హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలరీ రూ.6 కోట్లు, స్విట్జర్లాండ్ అధ్యక్షుడికి రూ.4.9 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా వారికి అదనపు భత్యాలు అందుతాయి.

News January 20, 2025

శ్రీవారి భక్తులకు అలర్ట్

image

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో ముగిశాయి. ఇవాళ భక్తులను ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో టీటీడీ అనుమతించనుంది. నేడు ప్రోటోకాల్ మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం, ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది డిసెంబర్‌లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి.