News March 29, 2024
అఖండకు మించి అఖండ-2లో బాలయ్య: రామ్స్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో అఖండకు సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్స్ తొలి పార్ట్‌కు మించి ఉంటాయని నటుడు, కాస్ట్యూమ్స్ డిజైనర్ రామ్స్ ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ‘ఈమధ్యే బోయపాటితో కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడాను. అఖండకు ఆయన, నేను కలిసే కాస్ట్యూమ్స్ రూపొందించాం. బాలయ్య లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. రెండో పార్ట్‌లో అంతకు మించి ఉంటాయి’ అని స్పష్టం చేశారు.
Similar News
News March 27, 2026
అలా అయితే ధోనీ IPL ఆడొద్దు: అశ్విన్

IPL-2026లో CSK లెజెండ్ ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడొద్దని మాజీ క్రికెటర్ అశ్విన్ అన్నారు. ‘ధోనీ ప్లేయింగ్-11లోనే ఉండాలి. 3 నెలల నుంచి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆడగలననే నమ్మకం ఉంది కాబట్టే అలా చేశారు. ఒకవేళ తుది జట్టులో లేకపోతే టోర్నీ మొత్తానికే ఆడకూడదు. ఫీల్డ్‌లో ఉంటే కెప్టెన్ రుతురాజ్‌కు సపోర్ట్ ఇస్తారు. ఒకవేళ ధోనీకి ఆడాలని లేకపోతే రిటైర్ అవుతారు’ అని అభిప్రాయపడ్డారు.
News March 27, 2026
పెళ్లయిన వ్యక్తి మరొకరితో సహజీవనం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు

పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. నైతికత, చట్టం వేర్వేరు అని పేర్కొంది. చట్టం ప్రకారం నేరం రుజువు కానప్పుడు పౌరుల హక్కులను పరిరక్షించడంలో న్యాయస్థానం తీసుకునే చర్యలను సామాజిక అభిప్రాయాలు, నైతికత నిర్దేశించలేవంది. లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న జంట రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది.
News March 27, 2026
నైవేద్యంగా వడపప్పు, పానకం.. ఎందుకంటే?

శ్రీరామనవమి రోజున వడపప్పు, పానకం నైవేద్యంగా ఇవ్వడం వెనుక ఆరోగ్య, ఆధ్యాత్మిక విశిష్టతలు ఉన్నాయి. శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుండటంతో ఈ బెల్లంతో చేసిన పానకం ‘ఎనర్జీ డ్రింక్’లా పనిచేస్తుంది. నానబెట్టిన పెసరపప్పు (వడపప్పు) శరీరంలోని వేడిని తగ్గించి చలవ చేస్తుంది. రాముడికి ఇష్టమైన ఈ సాత్విక ఆహారాన్ని శ్రీరామనవమి నాడు సమర్పిస్తే ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చని భక్తుల నమ్మకం.


