News March 29, 2024

అఖండకు మించి అఖండ-2లో బాలయ్య: రామ్స్

image

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో అఖండకు సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్స్ తొలి పార్ట్‌కు మించి ఉంటాయని నటుడు, కాస్ట్యూమ్స్ డిజైనర్ రామ్స్ ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ‘ఈమధ్యే బోయపాటితో కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడాను. అఖండకు ఆయన, నేను కలిసే కాస్ట్యూమ్స్ రూపొందించాం. బాలయ్య లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. రెండో పార్ట్‌లో అంతకు మించి ఉంటాయి’ అని స్పష్టం చేశారు.

Similar News

News February 12, 2026

ADB: ఓటర్ల చెంతకు వాహనం.. కలెక్టర్ రాజర్షి షా చొరవ

image

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేలా ఉచిత వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లను ఇంటి వద్ద నుంచే పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చారు.

News February 12, 2026

కిసాన్ రైల్ ద్వారా 34 వేల టన్నుల పంట ఉత్పత్తుల రవాణా

image

ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కిసాన్ రైల్ ద్వారా 116 సర్వీసులతో 34వేల టన్నుల పంట ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకు రవాణా చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2020 AUG 7న కిసాన్ రైళ్లను కేంద్రం ప్రారంభించింది. AP నుంచి మామిడి, అరటి, ఉల్లి ఇతర ఉద్యాన ఉత్పత్తులను బిహార్, అస్సాం, ప.బెంగాల్, ఢిల్లీ, త్రిపురలకు రవాణా చేశామని.. లోక్‌సభలో TDP MP ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

News February 12, 2026

IMA డెహ్రాడూన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA)డెహ్రాడూన్‌లో 10 ఫ్యాకల్టీ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, PhD, NET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianmilitaryacademy.nic.in/