News March 29, 2024

నేడు రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ సా.5 గంటలకు కాంగ్రెస్ పీఈసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికలు, ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే సభ ఏర్పాట్లు, ఎంపీ స్థానాలు, 100 రోజుల పాలన వంటి అంశాలపై చర్చించనున్నారు. తుక్కుగూడ సభలో 5 గ్యారంటీలను ప్రకటించనున్నట్లు సీఎం రేవంత్ ఇప్పటికే వెల్లడించారు. ఈ సభకు రాహుల్ గాంధీ, ఖర్గే హాజరవుతారని పేర్కొన్నారు.

Similar News

News February 21, 2026

FSL అగ్నిప్రమాదంలో 1,100 ఫైల్స్ బూడిద

image

TG: హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(FSL)లో అగ్నిప్రమాదం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1,100 ఫైల్స్ అగ్నికి ఆహుతైనట్లు నాగ్‌పూర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తేల్చింది. అయితే ఆయా కేసుల డేటా రికవరీకి అధికారులు యత్నిస్తుండగా అది సాధ్యం కాదని నాగ్‌పూర్ బృందం పేర్కొంది. దగ్ధమైన ఫైల్స్‌లో ఏయే కేసులు ఉన్నాయనేదానిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News February 21, 2026

ప్రెగ్నెన్సీలో TT ఇంజెక్షన్ తీసుకోవచ్చా?

image

తల్లి, బిడ్డకు ధనుర్వాతం (టెటానస్ ఇన్ఫెక్షన్) రాకుండా నిరోధించడానికి ప్రెగ్నెన్సీలో TT ఇంజెక్షన్ కచ్చితంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. దీన్ని రెండు డోసులు తీసుకోవాలి. 2/3 నెలలో మొదటి డోస్, ఆ తర్వాత నాలుగు వారాల గ్యాప్‌తో రెండో డోస్ తీసుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీకి ముందు మూడేళ్లలో TT ఇంజెక్షన్ తీసుకుంటే బూస్టర్ డోస్ సరిపోతుందని చెబుతున్నారు.

News February 21, 2026

మనిషికి ‘బర్డ్‌ఫ్లూ’ సోకిందన్న ప్రచారం అవాస్తవం: వైద్యారోగ్య శాఖ

image

AP: చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి బర్డ్‌ఫ్లూ సోకిందన్న ప్రచారాన్ని వైద్యారోగ్య శాఖ ఖండించింది. రాష్ట్రంలో ఎక్కడా మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకలేదని స్పష్టం చేసింది. అనుమానిత లక్షణాలున్న 54 మందికి టెస్టులు చేయగా నెగటివ్ వచ్చిందని పేర్కొంది. ఇటీవల చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కోళ్లకు బ‌ర్డ్‌ఫ్లూ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.