News March 29, 2024

మహిళల ఆసియా కప్: జులై 21న భారత్vs పాక్

image

ఈ ఏడాది శ్రీలంక ఆతిథ్యమిచ్చే మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌ షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి 28 వరకు టోర్నీ జరగనుంది. ఈ సారి ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయి. గ్రూప్-Aలో భారత్, పాక్, యూఏఈ, నేపాల్, గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. జులై 19న యూఏఈతో, 21న పాక్‌తో, 23న నేపాల్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడనుంది.

Similar News

News February 13, 2026

డయాబెటిస్‌తో మతిమరుపు రిస్క్.. ఎలాగంటే?

image

టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవాళ్లలో మతిమరుపు రిస్క్ ఎక్కువని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటి ప్రకారం.. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బ్రెయిన్ గ్లూకోజ్‌ను వాడుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా న్యూరోలాజికల్ డ్యామేజ్ జరుగుతుంది. నిరంతర హైబీపీ వల్ల ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాస్కులర్ డ్యామేజ్ జరిగి బ్రెయిన్ టిష్యూ దెబ్బతింటుంది. దీంతో దీర్ఘకాలంలో అల్జీమర్స్ రిస్క్ పెరుగుతుంది.

News February 13, 2026

కాషాయ కలవరం.. పట్టించుకోని పట్టణ ఓటర్లు!

image

TG: పంచాయతీ ఎన్నికల్లో కొంత మేరకే ప్రభావం చూపిన BJP.. మున్సిపోల్స్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. పట్టణ ఓటర్లు తమ వైపు ఉంటారని అంచనా వేసింది. కానీ ఫలితాల్లో వెనకబడింది. ముగ్గురు MLAలున్న ఉమ్మడి ADB జిల్లాలో ప్రభావం చూపలేదు. నిర్మల్, భైంసాలో తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ MP సెగ్మెంట్‌ కరీంనగర్‌ పరిధిలో ఒక్క మున్సిపాలిటీలోనూ పోటీ ఇవ్వలేదు. మహబూబ్‌నగర్‌లో కూడా అదే పరిస్థితి.

News February 13, 2026

BJPకి ఓట్ల శాతం పెరిగింది: రామచందర్ రావు

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే BJPకి ఓటు శాతం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. తమ పార్టీని ఓడించడానికి ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని ఆరోపించారు. మొత్తం వార్డులు డివిజన్లు కలిపి 350సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతున్నాం అని తెలిపారు. హంగ్ వచ్చిన చోట బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు.