News March 29, 2024
మహిళల ఆసియా కప్: జులై 21న భారత్vs పాక్

ఈ ఏడాది శ్రీలంక ఆతిథ్యమిచ్చే మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి 28 వరకు టోర్నీ జరగనుంది. ఈ సారి ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయి. గ్రూప్-Aలో భారత్, పాక్, యూఏఈ, నేపాల్, గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. జులై 19న యూఏఈతో, 21న పాక్‌తో, 23న నేపాల్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడనుంది.
Similar News
News February 12, 2026
జుట్టుకు మసాజ్ చేస్తున్నారా?

ప్రస్తుత కాలంలో కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల చాలామందిలో జుట్టు ఎక్కువగా రాలడం, చుండ్రు వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వారానికోసారి హెయిర్ మసాజ్ చేసుకోవడం వల్ల కుదుళ్లకు దృఢత్వాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కుదుళ్ల వద్ద చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పొడిబారిపోవడం, జుట్టు ప్యాచుల్లా ఊడిపోవడం వంటి వాటికి మసాజ్ చక్కటి పరిష్కారం.
News February 12, 2026
విజయ్ మాల్యా INDకు వస్తేనే పిటిషన్‌ను విచారిస్తాం: హైకోర్టు

తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ <<17636225>>విజయ్ మాల్యా<<>> దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని విచారించాలంటే ఆయన ఇండియాకు తిరిగి రావాలని స్పష్టం చేసింది. ‘ఉద్దేశపూర్వకంగా కోర్టుకు హాజరుకాని వ్యక్తులు ఉపశమనం కోరలేరు. ఈ పిటిషన్‌ను కొట్టేయకుండా మరో అవకాశమిస్తున్నాం. ఆయన వస్తారో లేదో పేర్కొంటూ అఫిడవిట్ వేయండి’ అని సూచిస్తూ FEB 18కి వాయిదా వేసింది.
News February 12, 2026
నార్త్ ఈస్ట్రర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో ఉద్యోగాలు

<


