News March 29, 2024
దేవినేని ఉమాకు ఎన్నికల బాధ్యతలు
AP: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు అధిష్ఠానం ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తగా ఆయనను నియమించింది. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో ఆయనకు టికెట్ దక్కలేదు. 2009, 14లో ఆయన మైలవరం MLAగా గెలుపొందారు. YCP నుంచి TDPలో చేరిన సిట్టింగ్ MLA కృష్ణప్రసాద్‌కు TDP మైలవరం టికెట్ ఇచ్చింది.
Similar News
News November 6, 2024
ముగ్గురు US ప్రెసిడెంట్లతో మోదీ సావాసం
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక లాంఛనమైపోవడంతో ఆయనకు భారతీయులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా 2014 నుంచి ముగ్గురు అధ్యక్షులు మారినా మోదీ మాత్రం భారత ప్రధానిగానే ఉన్నారని గుర్తుచేస్తున్నారు. 2014-17 వరకు ఒబామా, 2017-21 వరకు ట్రంప్, 2021- 24 వరకు బైడెన్, మళ్లీ ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మూడు పర్యాయాలుగా మోదీ వీరితో సావాసం చేస్తున్నారు.
News November 6, 2024
ఢిల్లీకి బయల్దేరిన పవన్ కళ్యాణ్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఇవాళ సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. శాంతి భద్రతల అంశంపై షాతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత తిరిగి ఏపీకి పయనం కానున్నారు.
News November 6, 2024
చావును దాటి వైట్‌హౌస్‌పై జెండా ఎగరేసి..
US ఎన్నికల్లో విజయానికి ముందు డొనాల్డ్ ట్రంప్ అష్టకష్టాలు పడ్డారు. కోర్టుల్లో చాలా కేసులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో ఎన్నికల్లో అసలు పోటీచేయకుండా కుట్రలు జరిగాయి. ఫెడరల్ కోర్టు దానిని కొట్టేసి మార్గం సుగమం చేసింది. ఆ తర్వాత పెన్సిల్వేనియా కాల్పుల్లో వెంట్రుకవాసిలో బుల్లెట్ నుంచి తప్పించుకున్నారు. మరోసారి గోల్ఫ్ కోర్ట్ వద్ద కాల్పులు జరిగాయి. చివరికి అన్నీ దాటుకొని వైట్‌హౌస్‌లో అడుగు పెడుతున్నారు.