News March 29, 2024

దేవినేని ఉమాకు ఎన్నికల బాధ్యతలు

image

AP: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు అధిష్ఠానం ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తగా ఆయనను నియమించింది. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో ఆయనకు టికెట్ దక్కలేదు. 2009, 14లో ఆయన మైలవరం MLAగా గెలుపొందారు. YCP నుంచి TDPలో చేరిన సిట్టింగ్ MLA కృష్ణప్రసాద్‌కు TDP మైలవరం టికెట్ ఇచ్చింది.

Similar News

News January 20, 2025

వెళ్తూ వెళ్తూ బైడెన్ సంచలన నిర్ణయం

image

మరికొద్ది గంటల్లో అధ్యక్షుడి కుర్చీ నుంచి దిగబోతున్న జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య నిపుణులు, కొవిడ్ రెస్పాన్స్ చీఫ్ డా.ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె, క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకు ముందస్తు క్షమాభిక్ష ప్రకటించారు. బైడెన్ తనకున్న అసాధారణ అధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ట్రంప్ ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.

News January 20, 2025

కల్తీ/నకిలీ పనీర్‌ను ఇలా తెలుసుకోండి..

image

నాన్‌వెజ్‌కు ప్రత్యామ్నాయంగా వాడే పనీర్‌లో నకిలీ/కల్తీ పెరిగాయి. దానిని గుర్తించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. డ్రై పాన్‌పై చిన్న పీస్‌ను వేడి చేయండి. ఒరిజినలైతే కలర్ బ్రౌన్‌గా మారి ముక్క కొంత పొడిపొడిగా అవుతుంది. ఉడికించిన పనీర్‌ను చల్లారబెట్టి ఆ నీటిలో అయోడిన్ చుక్కలు వేయండి. స్టార్చ్ ఉంటే నీరు నీలంగా మారుతుంది. ఇక కందిపొడి వేస్తే పనీర్ రెడ్‌గా మారిందంటే యూరియా, సర్ఫ్ వంటి కెమికల్స్ ఉన్నట్టే.

News January 20, 2025

చంద్రబాబు హయాంలో ఒక్క అప్పడాల మెషిన్ కూడా రాలేదు: YCP

image

చంద్రబాబు గెలిస్తే చాలు దావోస్ వెళ్లి పెట్టుబడులంటూ బిల్డప్ ఇస్తారని YCP విమర్శించింది. ‘అధికారంలో ఉన్న ఐదేళ్లూ దావోస్ వెళ్లి ఫోటోలు దిగి ప్రచారం చేసుకోవడం తప్ప ఇన్నేళ్లలో ఒక్క అటుకుల మిల్లు, అప్పడాల మెషిన్ కూడా రాలేదు. తండ్రీకొడుకులు ప్రజా ధనంతో షికార్లు చేసి వస్తారు. జగన్ తన హయాంలో ఎలాంటి హంగామా లేకుండా దావోస్ వెళ్లారు. అప్పుడు రూ.1,26,000 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి’ అని ట్వీట్ చేసింది.