News March 29, 2024
మహిళా క్రికెటర్‌పై బీజేపీ శ్రేణుల మండిపాటు

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్‌పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ‘వసూలి టైటాన్స్’ పేరుతో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా తదితర నేతలు క్రికెట్ ప్లేయర్లుగా ఉన్న పోస్టర్‌ను ఆమె ఇన్‌స్టా స్టోరీ పెట్టినట్లు ట్వీట్లు చేస్తున్నాయి. వస్త్రాకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తున్నాయి. మరోవైపు ఆమె ఇన్‌స్టా హ్యాక్ అయి ఉండొచ్చని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
Similar News
News March 13, 2026
రెస్టారెంటు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’

బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో పలు రెస్టారెంట్లు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’ కలిపి వేస్తున్నాయి. గ్యాస్ కొరతతో ఉన్న నిల్వలనే వాడుకోవాల్సి రావడం, ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.10-30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో టిఫిన్ రేట్లు పెరిగిపోయాయి. సాధారణంగా రూ.30-40 ఉండే మసాలా దోశ ధరను రూ.60కి పెంచేశారు.
News March 13, 2026
ఈనెల 18 నుంచి పెళ్లిళ్లు.. గ్యాస్ కొరతపై ఆందోళన

ఈనెల 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. యుద్ధం వల్ల ఏర్పడిన గ్యాస్ కొరత ప్రభావం పెళ్లి భోజనాలపై పడనుంది. ఫంక్షన్లకు పెద్ద ఎత్తున వంటలు చేసే క్యాటరింగ్ నిర్వాహకులు గ్యాస్ స్టవ్‌లను ఉపయోగిస్తుంటారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వంటలు ఎలా చేయాలనే ఆందోళన మొదలైంది. ఇక కట్టెల పొయ్యిపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టెలకూ డిమాండ్ పెరుగుతుండడంతో వివాహాలు చేసే కుటుంబాలపై మరింత భారం పడనుంది.
News March 13, 2026
పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. సన్‌రైజర్స్‌కు షాక్!

‘The Hundred’ టోర్నీకి <<19366541>>పాక్<<>> ఆటగాడు అబ్రార్‌ను కొని విమర్శలు ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి మరో షాక్ తగిలింది. సన్‌రైజర్స్ లీడ్స్ X అకౌంట్ సస్పెండ్ అయింది. రూల్స్ ఉల్లంఘించిన అకౌంట్లను X సస్పెండ్ చేస్తుందని ఆ పేజ్‌లో ఉంది. యూజర్లు రిపోర్ట్ చేయడం ఓ కారణంగా తెలుస్తోంది. ఫ్రాంచైజ్ ఓనర్ కావ్యా మారన్‌పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ఐపీఎల్‌లో SRH మ్యాచ్‌లు బాయ్‌కాట్ చేయాలని SMలో ట్రెండ్ చేస్తున్నారు.


