News March 29, 2024

మహిళా క్రికెటర్‌పై బీజేపీ శ్రేణుల మండిపాటు

image

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్‌పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ‘వసూలి టైటాన్స్’ పేరుతో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా తదితర నేతలు క్రికెట్ ప్లేయర్లుగా ఉన్న పోస్టర్‌ను ఆమె ఇన్‌స్టా స్టోరీ పెట్టినట్లు ట్వీట్లు చేస్తున్నాయి. వస్త్రాకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తున్నాయి. మరోవైపు ఆమె ఇన్‌స్టా హ్యాక్ అయి ఉండొచ్చని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

Similar News

News January 24, 2025

నాయుడుపేట: బాలుడి మిస్సింగ్

image

తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నందముని అనే బాలుడు మిస్ అయ్యాడు. సూళ్లూరుపేట మండల పరిధిలోని మన్నెమూర్తి గ్రామానికి చెందిన నందముని నాయుడుపేటలో చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల తర్వాత తల్లిదండ్రులు పాఠశాలలో వదిలారు. గురువారం నుంచి విద్యార్థి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు.

News January 24, 2025

రాజకీయాలు వీడుతున్నారని ప్రచారం.. స్పందించిన కొడాలి నాని

image

AP: ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు దూరం అవుతున్నారని తన పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్ అని మాజీ మంత్రి కొడాలి నాని కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. కాగా వైసీపీకి రాజీనామా చేస్తున్నాడని, గుడివాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా ఓ ట్వీట్ వైరలవుతోంది.

News January 24, 2025

2022లో ట్రంప్ ఉంటే యుద్ధమే ఉండేది కాదు: పుతిన్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే 2022లో ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమయ్యేదే కాదు. 2020లో ఆయన ఓడిపోవడం వల్ల పరిస్థితి మారింది’ అని వ్యాఖ్యానించారు. కాగా, యుద్ధం ఆపాలని ట్రంప్ నిన్న వ్యాఖ్యానించడంపై రష్యా స్పందించింది. వైట్ హౌస్ నుంచి సిగ్నల్ రాగానే పుతిన్ ట్రంప్‌తో చర్చలు ప్రారంభిస్తారని పేర్కొంది.