News March 29, 2024
రికార్డు బద్దలు కొట్టారు: SRH

IPL చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ ఘనతపై SRH ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. అభిషేక్ శర్మ, క్లాసెన్, హెడ్, మార్క్రమ్ ఫొటోలతో 277 అని ఉన్న పోస్టర్‌ను SRH షేర్ చేసింది. ‘పర్వతం ఎక్కేశారు. రికార్డు బద్దలు కొట్టారు. చరిత్ర సృష్టించారు’ అని ట్వీట్ చేసింది. ఇదివరకు ఈ రికార్డు RCB పేరుపై ఉండేది.
Similar News
News March 19, 2026
పిల్లలు తనకు పుట్టలేదన్న భర్త.. DNA టెస్టుకు కోర్టు నిరాకరణ

AP: భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపించడానికి తన ఇద్దరు పిల్లలకు DNA పరీక్ష నిర్వహించాలంటూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆ పిల్లలు తనకు పుట్టలేదన్న వాదనను తోసిపుచ్చింది. ఇది పిల్లల గౌరవానికి సంబంధించిన అంశమని, బలమైన కారణం లేకుండా DNA టెస్టుకు ఆదేశించలేమని తేల్చి చెప్పింది. భార్య తనను విడిచి వెళ్లిందని తొలుత భర్త విడాకుల పిటిషన్ వేశారని, అక్రమ సంబంధం గురించి కాదని పేర్కొంది.
News March 19, 2026
పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

సాధారణ అర్థంలో పరాభవ అంటే అవమానం, ఓటమి. దీని ప్రకారం ఈ సంవత్సరమంతా అపజయాలు ఉంటాయని కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించి ధర్మబద్ధంగా కష్టపడేవారికి విజయాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పరా-అమ్మవారు, భవ-ఉండు/ఆవిర్భావం/శివుడు అనే అర్థం. అంటే అమ్మవారికి సమీపాన ఉండటం లేదా పరాశక్తి ఆవిర్భావం లేదా అర్ధనారీశ్వర తత్వం అని కూడా అంటారు’ అని పేర్కొంటున్నారు.
News March 19, 2026
BREAKING: జాబ్ క్యాలెండర్ విడుదల

AP: 10,060 పోస్టులతో మంత్రి లోకేశ్ <<19422647>>జాబ్ క్యాలెండర్<<>> విడుదల చేశారు. ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నామని తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. ఉద్యోగార్థులందరూ ‘<


