News March 29, 2024
రికార్డు బద్దలు కొట్టారు: SRH
IPL చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ ఘనతపై SRH ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. అభిషేక్ శర్మ, క్లాసెన్, హెడ్, మార్క్రమ్ ఫొటోలతో 277 అని ఉన్న పోస్టర్‌ను SRH షేర్ చేసింది. ‘పర్వతం ఎక్కేశారు. రికార్డు బద్దలు కొట్టారు. చరిత్ర సృష్టించారు’ అని ట్వీట్ చేసింది. ఇదివరకు ఈ రికార్డు RCB పేరుపై ఉండేది.
Similar News
News January 21, 2025
భారీ ఎన్‌కౌంటర్.. 20కి చేరిన మృతుల సంఖ్య
ఛత్తీస్ గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 20కి చేరింది. ఇప్పటివరకు 20 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు ప్రకటించారు. మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి, కేంద్ర కమిటీ సభ్యులు మనోజ్, గుడ్డూ తదితరులు ఉన్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నట్లు సమాచారం. కాగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.
News January 21, 2025
రేప్ కేసుపై సీఎం స్పందించే తీరు ఇదేనా..
బెంగళూరు రేప్ కేసుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందన విమర్శలకు దారితీసింది. ఆ దారుణాన్ని ఖండించాల్సింది పోయి BJP హయాంలో అత్యాచారాలు జరగలేదా అని ప్రశ్నించారు. ‘BJP ప్రభుత్వ పాలనలోనూ అత్యాచారాలు జరిగాయి కదా. మహిళలు జాగ్రత్తగా ఉండాలి. వారిని కాపాడాలి. కానీ బయట కొందరు సంఘ విద్రోహులు ఉన్నారు. వారివల్లే ఇదంతా’ అని అన్నారు. ఒంటరి యువతిని ఇంటి వద్ద దించుతామని ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
News January 21, 2025
అమితాబ్ అపార్ట్‌మెంట్‌కు రూ.83కోట్లు!
అమితాబ్ బచ్చన్ ముంబై ఓషివారాలోని తన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను ₹83కోట్లకు అమ్మేశారు. ఆయనకు 168% ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తోంది. 2021 ఏప్రిల్‌లో ఆయన దీనిని ₹31కోట్లకు కొన్నారు. నవంబర్‌లో హీరోయిన్ కృతి సనన్‌కు నెలకు ₹10లక్షలకు రెంట్‌కు ఇచ్చారు. ఈ అపార్ట్‌మెంట్ విస్తీర్ణం 5,185 sq ft ఉంటుందని సమాచారం. కాగా బిగ్ బి ఫ్యామిలీ గత ఏడాది రియల్ ఎస్టేట్‌లో ₹100cr ఇన్వెస్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.