News March 29, 2024
ఎన్నికల తర్వాత BRS కనుమరుగు: ఉత్తమ్

TG: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. ఎంపీ ఎన్నికల్లో మేం 13 నుంచి 14 స్థానాల్లో గెలుస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పని అయిపోయింది ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ కష్టమే’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 27, 2026
ఎప్‌స్టీన్ ప్రకంపనలు.. దిగ్గజాల రాజీనామా

ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజాలు పదవులకు రాజీనామా చేస్తున్నారు. WEF CEO బోర్జ్ బ్రెండే, హార్వర్డ్ మాజీ ప్రెసిడెంట్ లారెన్స్ సమ్మర్స్, నోబెల్ గ్రహీత రిచర్డ్ ఆక్సెల్ తమ పదవుల నుంచి వైదొలిగారు. గోల్డ్‌మన్ శాక్స్ లీగల్ ఆఫీసర్ క్యాథీ రూమ్లెర్, హయత్ హోటల్స్ వారసుడు థామస్ ప్రిట్‌జ్కర్, DP వరల్డ్ ఛైర్మన్ సుల్తాన్ అహ్మద్, నార్వే అంబాసిడర్ మోనా కూడా ఈ లిస్టులో ఉన్నారు.
News February 27, 2026
సూసైడ్ గురించి సెర్చ్ చేస్తే పేరెంట్స్‌కు అలర్ట్

పిల్లలు సూసైడ్ లేదా సెల్ఫ్-హార్మ్ వంటి పదాలతో ఇన్‌స్టాలో సెర్చ్ చేస్తే.. వెంటనే పేరెంట్స్‌కు అలర్ట్ వెళ్లేలా కొత్త ఫీచర్ వచ్చింది. పేరెంట్స్ సూపర్విజన్ టూల్స్ వాడుతున్న వారికి ఈ నోటిఫికేషన్లు వాట్సాప్ లేదా SMS రూపంలో వెళ్తాయి. ప్రస్తుతం US, UK వంటి దేశాల్లో మొదలైన ఈ ఫీచర్ 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. పిల్లలను కౌన్సెల్ చేసేలా నిపుణుల సలహాలనూ ఇన్‌స్టా అందిస్తుంది.
News February 27, 2026
పాక్-అఫ్గాన్ బార్డర్‌లో యుద్ధ వాతావరణం

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ ఇటీవల జరిపిన<<19206132>> వైమానిక దాడులకు<<>> ప్రతీకారంగా తాలిబన్లు భారీ ఆపరేషన్ మొదలెట్టారు. డురాండ్ లైన్ వెంట పాక్‌కు చెందిన 15 చెక్‌పోస్టులను అధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్ ప్రకటించింది. ఈ దాడుల్లో 40 మంది పాక్ సైనికులు చనిపోయారని మరికొందరిని బంధించామని తెలిపింది. అటు పాక్ కూడా దీటుగా బదులిస్తున్నామని, పలువురు తాలిబన్లను చంపామని అంటోంది.


