News March 29, 2024
స్వల్పంగా పెరగనున్న ఔషధాల ధరలు!
పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి అత్యవసర మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అత్యవసర ఔషధాల జాబితాలోని మందుల ధరలు 0.0055% పెంచనున్నట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ వెల్లడించింది. అయితే ఇది గత ఏడాది, అంతకుముందు ఏడాది వచ్చిన హైక్స్తో పోలిస్తే చాలా తక్కువ. ఔషధాల ధరలు 2022లో 10%, 2023లో 12% పెరిగాయి.
Similar News
News November 6, 2024
నాని-ఓదెల కొత్త మూవీ పేరు ఏంటంటే?
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ‘దసరా’ తర్వాత రెండో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దానికి ‘పారడైజ్’ అన్న పేరును ప్రకటిస్తూ హీరో నాని ట్వీట్ చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సికింద్రాబాద్లోని ఓ హోటల్ నేపథ్యంలో కథ జరుగుతుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. దసరా విలేజ్ బ్యాగ్రౌండ్ రస్టిక్ డ్రామా కాగా.. ఈ మూవీ సిటీలో రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండనుందని టాక్.
News November 6, 2024
గ్రూప్-4 అభ్యర్థుల ‘పోస్ట్ కార్డు’ నిరసన
TG: గ్రూప్-4 పరీక్ష తుది ఫలితాల కోసం అభ్యర్థులు వినూత్న నిరసనకు దిగారు. పరీక్ష జరిగి దాదాపు 500 రోజులు కావస్తున్నా నియామకాలు జరగకపోవడంతో TGPSCకి భారీ సంఖ్యలో పోస్ట్ కార్డుల ద్వారా వినతిపత్రాలు పంపించారు. ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెలక్షన్ లిస్ట్ విడుదల చేసి 8 వేల మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
News November 6, 2024
ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన కాసేపటికే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా దేశం నుంచి అక్రమ వలసదారులను పంపించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన అధికార ప్రచార ప్రతినిధి కరోలిన్ వెల్లడించారు. తక్షణమే ఈ ఆపరేషన్ను ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు. కాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1.1 కోట్ల మందిని వెనక్కి పంపుతామని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.