News March 29, 2024

స్వల్పంగా పెరగనున్న ఔషధాల ధరలు!

image

పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి అత్యవసర మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అత్యవసర ఔషధాల జాబితాలోని మందుల ధరలు 0.0055% పెంచనున్నట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ వెల్లడించింది. అయితే ఇది గత ఏడాది, అంతకుముందు ఏడాది వచ్చిన హైక్స్‌తో పోలిస్తే చాలా తక్కువ. ఔషధాల ధరలు 2022లో 10%, 2023లో 12% పెరిగాయి.

Similar News

News January 13, 2025

పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్ కేసులు

image

హైదరాబాద్‌లో కొద్దిరోజులుగా స్కార్లెట్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 5-15 ఏళ్ల పిల్లలకు వ్యాపించే ఈ వైరస్‌తో ఆహారంపై అనాసక్తి, తీవ్రజ్వరం, నాలుక కందిపోవడం, నోట్లో పొక్కులు, గొంతులో మంట, నీరసం వంటి లక్షణాలుంటాయి. వీటితో పాటు 2-5 రోజుల్లో ఆయాసం, ముఖం వాపు, మూత్రం తగ్గడం, మూత్రంలో రక్తం గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.

News January 13, 2025

యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

image

ఎల్లుండి(15న) జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను NTA వాయిదా వేసింది. అభ్యర్థుల వినతి మేరకు సంక్రాంతి, పొంగల్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. కొత్త డేట్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. అటు 16న జరగాల్సిన ఎగ్జామ్ యథావిధిగా కొనసాగుతుందని చెప్పింది. కాగా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభమయ్యాయి.

News January 13, 2025

మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కన్నుమూత

image

AP: రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. రాజశేఖరం ZP ఛైర్మన్‌గా, 1994లో ఉణుకూరు MLAగా(ఆ నియోజకవర్గం ఇప్పుడు రద్దయ్యింది), రాజ్యసభ ఎంపీగా సేవలు అందించారు. ఈయన కుమారుడు పాలవలస విక్రాంత్ YCP MLCగా ఉన్నారు. కూతురు రెడ్డి శాంతి పాత పట్నం మాజీ ఎమ్మెల్యే.