News May 7, 2025

కర్రెగుట్టలో ఏం జరగబోతోంది?

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట వద్ద మావోయిస్టులు దిగొచ్చినట్లు తెలుస్తోంది. సైనిక ఆపరేషన్ వెంటనే ఆపేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు రావాలని బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేశ్ పేరిట ప్రెస్‌నోట్ విడుదలైంది. ఈ లేఖపై పోలీసులు ఇంకా స్పందించలేదు. ప్రభుత్వాలు సైతం శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురు మావోయిస్టులు మరణించారు.

Similar News

News March 16, 2026

200 మందికి పైగా పిల్లలు మృతి: ఇరాన్

image

US, ఇజ్రాయెల్ దాడుల్లో వందలాది ఇరానియన్లు చనిపోయారని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అరాఘ్చీ తెలిపారు. ఇందులో 200 మందికి పైగా పిల్లలున్నారని వెల్లడించారు. ఇరానియన్లను చంపడాన్ని పొరుగు దేశాలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ‘మేం సీజ్‌ఫైర్ వద్దనేది యుద్ధం కోసం కాదు. శత్రువులు మాపై మరోసారి దాడులు చేయకుండా ఉండేలా ఈ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నాం. ఇప్పటికే వారికి గుణపాఠం చెప్పాం’ అని పేర్కొన్నారు.

News March 16, 2026

రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ గెలుపు

image

బిహార్ CM నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రంలో 5 స్థానాలకు ఎన్నికలు జరగ్గా NDA కూటమి అన్నింటినీ కైవసం చేసుకుంది. నితీశ్ కుమార్‌తో పాటు BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎంపీలుగా ఎన్నికయ్యారు. దీంతో నితీశ్ త్వరలోనే CM పదవికి రాజీనామా చేయనున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ MP, MLA, MLCగా పనిచేశానని, రాజ్యసభ పదవితో మిగిలిన ఆ కోరిక నెరవేరబోతుందని చెప్పిన విషయం తెలిసిందే.

News March 16, 2026

కొత్త సబ్జెక్టులతో UG, PG కోర్సులు

image

TG: పాత డిగ్రీ కోర్సులకు కాలం చెల్లింది. అవి నేటి అవసరాలకు తగ్గట్టు ఉంటేనే ఉపాధి అవకాశాలు. ఈదిశగా TGCHE వాటిని ప్రక్షాళించింది. UG, PGలలో డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, ల్యాండ్, అగ్రికల్చర్, ఎయిర్ లైన్స్, స్పేస్, మారిటైమ్, ఫిన్‌టెక్, INT.బ్యాంకింగ్, ఫైనాన్స్, మల్టీమీడియా, యానిమేషన్, బయోమెడిక్స్, MED.మైక్రో బయాలజీ, ఇమ్యూనాలజీ వంటివి పెట్టింది. ఈ సమాచారాన్ని ‘https://tgche.ac.in’లో పొందుపరిచింది.