News May 7, 2025
చెపాక్‌లో చెన్నైకి చెక్ పెట్టిన SRH

చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి SRH అదరగొట్టింది. చెపాక్ స్టేడియంలో CSKపై తొలిసారి గెలిచింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది. అభిషేక్ 0, హెడ్ 19, ఇషాన్ 44, క్లాసెన్ 7, అనికేత్ 19, కమిందు 32*, నితీశ్ 19* రన్స్ చేశారు. నూర్ అహ్మద్ 2, ఖలీల్, కాంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను ఆరెంజ్ ఆర్మీ సజీవంగా ఉంచుకోగా, చెన్నై దాదాపుగా ఔటైంది.
Similar News
News March 28, 2026
గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

గల్ఫ్ దేశాల గగనతలాలు ఉపయోగించుకొని ఇరాన్‌పై US-ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయని ఆ దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ మండిపడ్డారు. బహ్రెయిన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, UAE తదితర దేశాలపై తాము దాడులు ఆపాలంటే ఆ 2 దేశాలకు అనుమతి ఇవ్వొద్దన్నారు. ఏ దేశంపైనా తాము ముందస్తు దాడులు చేయబోమని.. తమ అణు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యం చేసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. శత్రువులకు సహకరించిన వారినీ వదలబోమన్నారు.
News March 28, 2026
‘లుంగీ మ్యాన్’గా సిద్ధూ జొన్నలగడ్డ!

‘డీజే టిల్లు’గా సినీ ప్రేక్షకులను అలరించిన సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న కొత్త సినిమా అప్‌డేట్ వచ్చింది. అనిల్ అనే కొత్త దర్శకుడితో ఆయన చేస్తున్న మూవీకి ‘లుంగీ మ్యాన్’ అనే టైటిల్ ఖరారయినట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమం ఈనెల 19న జరిగింది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా సిద్ధూ చివరి 2 సినిమాలు ‘జాక్’, ‘తెలుసు కదా’ నిరాశపరిచిన సంగతి తెలిసిందే.