News May 7, 2025
పాకిస్థానీలు రేపటిలోగా వెళ్లిపోవాలి: ఏపీ డీజీపీ

ఏపీలోని పాకిస్థానీలందరూ వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. రేపటి తర్వాత ఆ దేశస్థులు రాష్ట్రంలో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి ఆదేశాల మేరకు <<16214062>>తెలంగాణ డీజీపీ జితేందర్<<>> కూడా పాకిస్థానీలు వెళ్లిపోవాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 15, 2026
గిల్, మంధానకు ప్రతిష్ఠాత్మక అవార్డులు

2024-2025 ఏడాదికి గానూ క్రికెటర్లు గిల్, మంధానను ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి. అంతర్జాతీయ మెన్స్ క్రికెట్‌లో గొప్ప గౌరవంగా భావించే పాలీ ఉమ్రిగర్ అవార్డును గిల్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది బెస్ట్ ఇంటర్నేషనల్ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధానను BCCI ఎంపిక చేసింది. ఈమె ఈ అవార్డు అందుకోవడం ఐదోసారి కావడం విశేషం. ఢిల్లీలో జరిగిన నమన్ అవార్డ్స్-2026 వేడుకలో వీరిద్దరూ ఈ పురస్కారాలు అందుకున్నారు.
News March 15, 2026
కమ్యూనిస్ట్ గడ్డపై కమలం వికసిస్తుందా?

సౌత్ ఇండియాపై కన్నేసిన BJP కమ్యూనిస్ట్ గడ్డ కేరళంపై జెండా ఎగురవేయాలని చూస్తోంది. పినరయి విజయన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, శబరిమల గోల్డ్ చోరీ కేసును అవకాశంగా మలుచుకుంటోంది. అటు కేరళంలో BJPని అడుగుపెట్టనివ్వబోమని విజయన్ అంటున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. <<19389988>>మే 4న<<>> వెలువడే ఫలితాలు కేరళం రాజకీయ భవిష్యత్తును తేల్చనున్నాయి..
News March 15, 2026
పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్

AP: పార్టీ చీఫ్ చంద్రబాబు <<19391495>>ఆదేశాలతో<<>> పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని TDP రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరణ ఇచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.


