News March 30, 2024
కేజ్రీవాల్ కోసం రేపు ఢిల్లీలో ‘ఇండియా’ సభ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి రేపు ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. 13పార్టీల నేతలు దీనిలో పాల్గొననున్నారు. తాన్షాహీ హఠావో-లోక్తంత్ర బచావో అన్న నినాదంతో ఈ సభను నిర్వహిస్తామని కూటమి నేతలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, తృణమూల్ ఎంపీ ఒబ్రెయిన్ సహా పలువురు ప్రముఖులు సభకు హాజరుకానున్నారు.
Similar News
News December 28, 2024
మన్మోహన్ స్మారకార్థం స్థలం కేటాయించిన కేంద్రం
మన్మోహన్ సింగ్ <<14998092>>అంత్యక్రియలపై వివాదం<<>> రాజుకున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభ్యర్థన మేరకు మన్మోహన్ స్మారకార్థం ఢిల్లీలో స్థలం కేటాయింపునకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్ మీటింగ్ పూర్తయిన వెంటనే అమిత్ షా దీనిపై నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాయి.
News December 28, 2024
రేపు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం
TG: సిద్దిపేట(D) కొమురవెల్లిలోని ప్రఖ్యాత మల్లికార్జున స్వామి కళ్యాణ వేడుక రేపు ఉ.10.45 గంటలకు వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవదాయ శాఖ పూర్తి చేసింది. ఈ కళ్యాణంతో బ్రహ్మోత్సవాలకు కూడా అంకురార్పణ జరగనుంది. రేపటి నుంచి మార్చి 24 వరకు నిర్వహించే జాతరకు AP, TGలతోపాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు వస్తారు.
News December 28, 2024
ఘోరం: కుటుంబమంతా ఆత్మహత్య
AP: వైఎస్సార్(D) సింహాద్రిపురం(M) దిద్దేకుంటలో విషాదకర ఘటన జరిగింది. అప్పుల బాధతో ఓ అన్నదాత కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. రైతు నాగేంద్ర(40) చీనీ తోట సాగు చేస్తున్నారు. ఆదాయం లేకపోవడం, రుణదాతల ఒత్తిడి పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో భార్య వాణి(38), పిల్లలు గాయత్రి(12), భార్గవ్(11)ను తోటకు తీసుకెళ్లి ఉరివేశాడు. అనంతరం తానూ సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.