News March 30, 2024

కేజ్రీవాల్‌ కోసం రేపు ఢిల్లీలో ‘ఇండియా’ సభ

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి రేపు ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. 13పార్టీల నేతలు దీనిలో పాల్గొననున్నారు. తాన్‌షాహీ హఠావో-లోక్‌తంత్ర బచావో అన్న నినాదంతో ఈ సభను నిర్వహిస్తామని కూటమి నేతలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, తృణమూల్ ఎంపీ ఒబ్రెయిన్ సహా పలువురు ప్రముఖులు సభకు హాజరుకానున్నారు.

Similar News

News February 9, 2026

గోండ్ కటిరాతో ఎన్నో లాభాలు

image

గోండ్ కటిరాలో ఉండే ప్రొటీన్ మీ కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, కణజాలాలను బాగు చేయడంలో సహాయపడుతుంది. ఇది శక్తిని కూడా అందిస్తుంది. గోండ్ కటిరా తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గోండ్ కటిరా తినడం వలన చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇది ముఖం పై మొటిమలను పోగొట్టడంలో, జుట్టు సమస్యలకు చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

News February 9, 2026

220 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు.. అప్లై చేశారా?

image

చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీ 220 Jr. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, NAC/NTC/STC అర్హతతో పాటు పని అనుభవం గలవారు FEB 14 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://avnl.co.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News February 9, 2026

విశాఖ టు చెన్నై.. క్రూయిజ్‌షిప్ విహారానికి ఏర్పాట్లు

image

AP: ఈ ఏడాది కూడా విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వరకు లగ్జరీ క్రూయిజ్‌షిప్ విహారానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. జూన్ 24, జులై 1, 8, 15వ తేదీల్లో సర్వీసులు ఉంటాయి. రేట్లు, టైమింగ్స్‌పై విశాఖ పోర్టు అధికారులు కార్డిలియా క్రూయిజ్‌ ఎంవీ ఎంప్రెస్ యాజమాన్యంతో చర్చలు పూర్తిచేశారు. త్వరలోనే టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ 11 అంతస్తుల షిప్‌ ఇప్పటికే మూడుసార్లు విశాఖ నుంచి సేవలందించింది.