News March 30, 2024
తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

AP: విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి భక్తులు బయట లైన్లలో వేచి ఉన్నారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటలు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న 60,958 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Similar News
News April 17, 2026
LNG ఇంపోర్ట్స్.. భారత్‌కు ఇక బోలెడన్ని ప్రత్యామ్నాయాలు!

LNG కోసం ఇప్పటివరకు ఎక్కువగా ఖతర్‌పైన ఆధారపడిన భారత్ పశ్చిమాసియా యుద్ధ పరిణామాలతో కొత్త సోర్సులను కనెక్ట్ చేసుకుంది. ఏడేళ్ల గ్యాప్ తర్వాత నార్వే నుంచి, రెండేళ్ల విరామం తర్వాత రష్యా నుంచి భారత్‌కు త్వరలో LNG కార్గోలు రానున్నట్లు సమాచారం. ఇక ఆఫ్రికా దేశాల నుంచి 1.2 మిలియన్ టన్నుల LNGకి భారత్ ఆర్డర్ చేసింది. ఇందులో ఆరు నౌకలు గత నెల భారత్ చేరుకోగా మరో 7,54,000 టన్నుల LNG ఈనెలాఖరుకు రానుంది.
News April 17, 2026
హార్ముజ్‌ను ఇరాన్ ఇక ఆయుధంగా వాడదు: ట్రంప్

హార్ముజ్ జలసంధిని ఇకపై ఎప్పటికీ తెరిచే ఉంచేందుకు ఇరాన్ అంగీకరించిందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇకపై దానిని ఆ దేశం ఆయుధంగా ప్రయోగించదన్నారు. తమ సహకారంతో ఇరాన్ హార్ముజ్‌లోని మైన్స్‌ను తొలగిస్తోందన్నారు. యుద్ధం వేళ సమన్వయం పాటిస్తూ సహకరించిన సౌదీ, యూఏఈ, ఖతర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ అద్భుతమైన వ్యక్తులని పొగడ్తలతో ముంచెత్తారు.
News April 17, 2026
ఫ్రిజ్‌ను ఆఫ్ చేస్తున్నారా?

ఫ్రిజ్‌ను తరచూ ఆన్ ఆఫ్ చేస్తే కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజులు బయటికెళ్తున్నా, రిఫ్రిజరేటర్‌లో పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు ఉన్నా ఆఫ్ చేయొద్దని సూచిస్తున్నారు. వారాలపాటు మీరు ఇంట్లో లేకపోతే ఫ్రిజ్‌ను పూర్తిగా ఖాళీ చేసి ఆఫ్ చేయొచ్చని పేర్కొంటున్నారు. ట్రేలను శుభ్రం చేసి ఆరబెట్టాలని, లేదంటే ఫ్రిజ్ దుర్వాసన వస్తుందంటున్నారు.


