News March 30, 2024

కమల్‌ హాసన్‌ను మించిన నటుడు జగన్: CBN

image

AP: సీఎం జగన్‌పై టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సీమలో ట్రెండ్ మారిందని.. వైసీపీ బెండు విరగడం ఖాయమని చెప్పారు. ప్రొద్దుటూరులో ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడారు. జగన్ కమల్ హాసన్‌ను మించిన నటుడని.. ఆయనను కరకట్ట కమల్ హాసన్ అని పిలుస్తానని అన్నారు. ఏపీలో అన్ని లోక్‌సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News January 21, 2026

నాకు ఆ చిన్న ఐస్ ముక్క చాలు.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్

image

దావోస్‌ వేదికగా నాటో దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ‘నేను కేవలం ఒక ఐస్ ముక్క మాత్రమే అడుగుతున్నాను. ఇందుకు నో అనేవారిని అస్సలు మర్చిపోను’ అని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడానికి ఫోర్స్‌ను కూడా ఉపయోగించనంటూ పరోక్ష బెదిరింపులకు దిగారు. ఆ ప్రాంతాన్ని కాపాడడం తమకే సాధ్యమని, ఇంకెవరూ ఆ పని చేయలేరని చెప్పుకొచ్చారు.

News January 21, 2026

SONY ఠీవీ.. ఇక ఇంటికి రాదా?

image

TV బ్రాండ్ అనగానే విన్పించే SONY సంస్థ TCLతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఇకపై సోనీ బ్రాండ్ టీవీలు మార్కెట్లోకి రావా? అనే సందేహం నెలకొంది. అయితే SONY, BRAVIA పేర్లతోనే TCL టెలివిజన్ సెట్స్ తయారు చేయనుంది. భాగస్వామ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలో జపాన్ దిగ్గజానికి 49% వాటా, చైనా ప్రభుత్వం భాగస్వామిగా గల TCLకు 51% షేర్ ఉంటాయి. అయితే ప్రొడక్షన్ మారడంతో క్వాలిటీ తదితరాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.

News January 21, 2026

OpenAI పని ఖతం: జార్జ్ నోబుల్

image

OpenAI కంపెనీ త్వరలో కుప్పకూలుతుందని ప్రముఖ ఇన్వెస్టర్ జార్జ్ నోబుల్ అంచనా వేశారు. ఓవైపు Google Gemini యూజర్లు పెరుగుతుంటే ChatGPT ట్రాఫిక్ వరుసగా 2 నెలలు పడిపోయిందన్నారు. ఆ కంపెనీ సింగిల్ క్వార్టర్‌లో $12B నష్టపోయిందని, టాలెంటెడ్ ఉద్యోగులూ వెళ్లిపోతున్నారని చెప్పారు. మరోవైపు మస్క్ వేసిన $134B <<14762221>>దావా<<>> ఏప్రిల్‌లో విచారణకు రానుందని గుర్తుచేశారు. వీటన్నింటితో ఆ సంస్థకు మనుగడ కష్టమేనని అభిప్రాయపడ్డారు.