News March 30, 2024

కమల్‌ హాసన్‌ను మించిన నటుడు జగన్: CBN

image

AP: సీఎం జగన్‌పై టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సీమలో ట్రెండ్ మారిందని.. వైసీపీ బెండు విరగడం ఖాయమని చెప్పారు. ప్రొద్దుటూరులో ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడారు. జగన్ కమల్ హాసన్‌ను మించిన నటుడని.. ఆయనను కరకట్ట కమల్ హాసన్ అని పిలుస్తానని అన్నారు. ఏపీలో అన్ని లోక్‌సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News February 12, 2026

ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్‌లో 89 పోస్టులు

image

ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్‌(<>IREL<<>>) 89 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI, BE/BTech, డిప్లొమా, BCom, BA/BBA/BSc అర్హతగల వారు ఫిబ్రవరి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా apprenticeshipindia.org/ NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.irel.co.in

News February 12, 2026

ఆగస్టు 21న నాని ‘ప్యారడైజ్’ విడుదల

image

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ప్యారడైజ్’ చిత్రం విడుదల వాయిదా పడింది. మార్చి 26న రావాల్సిన ఈ మూవీని ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘నేను తొందరపడాలి అనుకోవట్లేదు. దీనికి నాకు కొంత సమయం కావాలి. 21-08-2026న ప్యారడైజ్ వస్తుంది’ అని పేర్కొంటూ శ్రీకాంత్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News February 12, 2026

జుట్టుకు మసాజ్ చేస్తున్నారా?

image

ప్రస్తుత కాలంలో కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల చాలామందిలో జుట్టు ఎక్కువగా రాలడం, చుండ్రు వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వారానికోసారి హెయిర్‌ మసాజ్‌ చేసుకోవడం వల్ల కుదుళ్లకు దృఢత్వాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కుదుళ్ల వద్ద చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పొడిబారిపోవడం, జుట్టు ప్యాచుల్లా ఊడిపోవడం వంటి వాటికి మసాజ్ చక్కటి పరిష్కారం.