News March 30, 2024
ఢిల్లీ జల్ బోర్డు కేసులో ఛార్జిషీట్ దాఖలు

ఢిల్లీ జల్ బోర్డు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ED ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఫ్లో మీటర్ల కొనుగోళ్ల టెండర్లలో అవినీతి జరిగినట్లు ఆరోపించింది. DJB మాజీ చీఫ్ ఇంజినీర్ జగదీశ్ అరోరా, కాంట్రాక్టర్ అనిల్ అగర్వాల్, NBCC మాజీ GM మిట్టల్, తేజిందర్ సింగ్ అనే నలుగురితో పాటు NKG ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు ED సమన్లు పంపిన సంగతి తెలిసిందే.
Similar News
News March 7, 2026
భీకర దాడి.. 47 మంది మృతి

ఇరాన్‌తోపాటు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇవాళ ష్ముస్టార్, నబీ చిట్ పట్టణాలపై చేసిన ఎయిర్‌స్టైక్స్‌లో 47 మంది మరణించినట్లు లెబనీస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది పౌరులేనని తెలిపింది. మరో 40 మంది గాయపడినట్లు పేర్కొంది. కాగా 2023 OCT నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 4వేల మందికి పైగా మరణించగా, దాదాపు 17వేల మంది గాయపడినట్లు సమాచారం.
News March 7, 2026
‘కొండ మీది కోతి’నీ తెచ్చి ఇస్తారేమో!

ఎన్నికల హామీలు చూస్తుంటే త్వరలో ఎవరో ఒకరు కొండ మీది కోతినీ తెచ్చిస్తామంటారని జోకులు పేలుతున్నాయి. ఇవాళ <<19323424>>TVK విజయ్<<>> కురిపించిన హామీలతో ఈ ప్రస్తావన తెరపైకి వచ్చింది. సాధ్యమేనా? అని కాకుండా గెలుపే లక్ష్యంగా ఇస్తున్న హామీల భారం ట్యాక్సుల రూపేనా ప్రజలపైనే పడుతుందని రాజకీయవేత్తలు అంటున్నారు. ఉచితాలతో రాష్ట్రాల ప్రగతి మందగిస్తుందని పలు సందర్భాల్లో కోర్టులు చెప్పిన మాటలూ గుర్తుచేస్తున్నారు.
News March 7, 2026
‘మీ పని చూసుకోండి’.. ట్రంప్‌పై కమల్ హాసన్ ఫైర్

రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు భారత్‌కు అనుమతిస్తున్నామన్న అమెరికా ప్రకటనపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత్ సార్వభౌమ దేశమని.. విదేశాల నుంచి ఆదేశాలు తీసుకోదంటూ ట్రంప్‌ను ట్యాగ్ చేస్తూ Xలో పోస్ట్ చేశారు. మీ పని మీరు చూసుకోండంటూ ఘాటుగా స్పందించారు. దేశాల మధ్య పరస్పర గౌరవమే ప్రపంచ శాంతికి పునాది అని హితవు పలికారు.


