News March 30, 2024

కాచిన నూనె మళ్లీ వంటలకు వాడుతున్నారా?

image

కాచిన నూనెను మళ్లీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని అమెరికా సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ అధ్యయనంలో వెల్లడైంది. క్యాన్సర్, కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాచిన నూనెల వల్ల శారీరక సమతుల్యత దెబ్బతింటుందని, క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని, జీర్ణ వ్యవస్థ, కాలేయం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ స్థాయులూ పెరుగుతాయని వెల్లడించారు.

Similar News

News March 25, 2026

ఇరాన్‌కు చేరిన ట్రంప్ ప్రపోజల్.. వయా పాకిస్థాన్!

image

ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల సీజ్‌ఫైర్ ప్రపోజల్‌ను ఇరాన్‌కు పాకిస్థాన్ అప్పగించినట్లు Reuters తెలిపింది. తమ మధ్యవర్తుల ద్వారా ప్రపోజల్‌ను ఇరాన్ యంత్రాంగానికి అందజేశామని పాక్ అధికారులు చెప్పారని పేర్కొంది. ఇస్లామాబాద్‌లో US, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయని, US ఉపాధ్యక్షుడు వాన్స్ కూడా పాల్గొంటారని <<19468358>>వార్తలు రావడం<<>> తెలిసిందే.

News March 25, 2026

అన్ని కాలేజీల్లో ఇక ఫేషియల్ రికగ్నిషన్ హాజరు

image

AP: కాలేజీకి రాకుండానే హాజరును మేనేజ్ చేద్దామనుకుంటే ఇక కుదరదు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు, లెక్చరర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేయాలని GOVT నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌తో పాటు ప్రైవేటు కాలేజీలకూ వచ్చే ఏడాది నుంచి ఇది వర్తించనుంది. రియల్ టైమ్ పర్యవేక్షణతో హాజరు శాతాన్ని పెంచడం ద్వారా ప్రమాణాలు మెరుగుపర్చనుంది. 75% హాజరుంటేనే విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుంది.

News March 25, 2026

రాహుల్ పర్యటన రద్దు.. కేరళంకు రేవంత్

image

కడుపు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కేరళం టూర్ రద్దయింది. రాహుల్‌కు బదులుగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు TG CM రేవంత్ కేరళంకు బయల్దేరారు.