News March 30, 2024
రింకూ సింగ్‌కు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి తర్వాత KKR ప్లేయర్లను రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కలిశారు. యువ బ్యాటర్లను అభినందిస్తూ వారికి పలు సూచనలు చేశారు. ఈక్రమంలో డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీతో దిగిన ఫొటోలను KKR ప్లేయర్ రింకూ సింగ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తనకు పలు సూచనలు చేసి స్పెషల్ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు థాంక్స్ అని పేర్కొన్నారు.
Similar News
News November 7, 2024
ఆ దేశంలో బిచ్చగాళ్లే ఉండరు!
మన పొరుగు దేశం భూటాన్‌లో నిలువ నీడ లేనివారు, బిచ్చగాళ్లు ఏమాత్రం కనిపించరు. ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో క్రమం తప్పకుండా చోటు సంపాదించే అక్కడ ప్రజల అవసరాల్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. వారికి నివాసం, భూమి, ఆహార భద్రత వంటివన్నీ చూసుకుంటుంది. దీంతో ఇతర దేశాల్లో కనిపించే సహజమైన సమస్యలు ఇక్కడ కనిపించవు. అన్నట్లు ఇక్కడ వైద్య చికిత్స ఉచితం కావడం విశేషం.
News November 7, 2024
PHOTOS: కన్నీళ్లు పెట్టుకున్న కమల మద్దతుదారులు
అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ తీవ్రంగా పోరాడినా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించలేకపోయారు. కౌంటింగ్ సందర్భంగా ఆమె ఏ దశలోనూ ట్రంప్‌ను అందుకోలేపోయారు. ఫలితాల సరళిని బట్టి కమల ఓటమి లాంఛనం కావడాన్ని మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతం అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
News November 7, 2024
అగరబత్తి పొగ మంచిదేనా..?
చాలామంది భక్తులు పూజల్లో అగరబత్తుల్ని విపరీతంగా వెలిగిస్తుంటారు. కానీ ఆ పొగ అంత మంచిది కాదని అమెరికాకు చెందిన NIH పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అగరబత్తుల పొగ ఎక్కువగా పీలిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని వారు హెచ్చరించారు. ఒక అగరబత్తిని వెలిగిస్తే 45 మి.గ్రాముల కంటే ఎక్కువ కణాలు విడుదలవుతాయని, అవి సిగరెట్‌కంటే ఎక్కువని తెలిపారు. ఆ పొగలో ప్రమాదకరమైన పలు కర్బన సమ్మేళనాలు ఉంటాయని వివరించారు.