News March 30, 2024

వడ్డీ రేట్లలో నో ఛేంజ్?

image

వడ్డీ రేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ 5న జరిగే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపోరేటును యథాతథంగా (6.5%) కొనసాగించాలని RBI నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఆహార ఉత్పత్తుల ధరల పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో RBI అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 5.1% నమోదు కాగా ఈనెల అది 5.2%కు పెరగొచ్చని అంచనా వేసింది.

Similar News

News November 7, 2024

స్కూల్ విద్యార్థులకు శుభవార్త

image

AP: 2025-26 విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం అమలుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. రూ.953 కోట్లతో 1 నుంచి 10వ తరగతి చదివే 35 లక్షల మందికి కిట్లు ఇవ్వనుంది. ఈ కిట్‌లో బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫాం అందించనుంది. దీంతో పాటు యూనిఫాం కుట్టుకూలి కింద 1-8 క్లాసుల వారికి ₹120, 9,10 క్లాసుల వారికి ₹240 చెల్లించనుంది.

News November 7, 2024

11 నుంచి భవానీ దీక్షల స్వీకరణ

image

AP: విజయవాడ దుర్గగుడిలో ఈ నెల 11 నుంచి 15 వరకు భవానీ దీక్షల స్వీకరణ జరగనుంది. డిసెంబర్ 1న అర్ధమండల దీక్షల స్వీకరణ ప్రారంభమై 5వ తేదీతో ముగుస్తుంది. DEC 21 నుంచి 25 వరకు దీక్షల విరమణలు జరుగుతాయి. దీంతో డిసెంబర్ 21-26 వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏకాంతంగా అర్చకులు మాత్రమే సేవలు నిర్వహిస్తారు. దీక్షల విరమణ సందర్భంగా ప్రతిష్ఠాపన, శతచండీయాగం, గిరి ప్రదక్షిణలు జరుగుతాయి.

News November 7, 2024

ఎల్లుండి నుంచి సమగ్ర కుటుంబ సర్వే

image

TG: ప్రభుత్వం నిన్నటి నుంచి కులగణన సర్వే ప్రక్రియ ప్రారంభించింది. ప్రతి ఇంటికీ వెళ్తున్న సిబ్బంది ఇంటి నంబర్, యజమాని పేరు నమోదు చేసుకుంటున్నారు. రేపటి వరకు ఆ వివరాలన్నీ సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఎల్లుండి నుంచి కుటుంబ సర్వే మొదలవుతుంది. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలను ఎంటర్ చేస్తారు. ఈ ప్రక్రియను నవంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.