News March 30, 2024

వడ్డీ రేట్లలో నో ఛేంజ్?

image

వడ్డీ రేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ 5న జరిగే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపోరేటును యథాతథంగా (6.5%) కొనసాగించాలని RBI నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఆహార ఉత్పత్తుల ధరల పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో RBI అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 5.1% నమోదు కాగా ఈనెల అది 5.2%కు పెరగొచ్చని అంచనా వేసింది.

Similar News

News January 14, 2025

ఆస్కార్స్ 2025: నామినేషన్స్ ప్రకటన వాయిదా

image

లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఆస్కార్స్-2025 నామినేషన్స్ ప్రకటన వాయిదా పడింది. ఓటింగ్ పీరియడ్‌ను పొడిగించారు. ఈనెల 17న నామినేషన్స్‌ను వెల్లడించాల్సి ఉండగా, 23వ తేదీకి వాయిదా వేశారు. ఆరోజున వర్చువల్‌గా నామినీల లిస్టును ప్రకటించనున్నారు. మార్చి 2న అవార్డులను ప్రకటిస్తారు.

News January 14, 2025

రూపాయి పతనం కొంత కాలమే: SBI రిపోర్ట్

image

భారత రూపాయి పతనంపై ట్రంప్ ప్రభావం కొంత కాలమే ఉంటుందని SBI రిపోర్ట్ పేర్కొంది. ఆయన ప్రెసిడెన్సీ ఆరంభంలో మన కరెన్సీకి ఒడుదొడుకులు ఎదురైనా త్వరలోనే స్థిరత్వం సాధిస్తుందని అంచనా వేసింది. చరిత్రను పరిశీలిస్తే డెమోక్రాట్ల కన్నా రిపబ్లికన్ల హయాంలోనే INR మెరుగ్గా రాణించిందని 2013 నాటి ‘టేపర్ తంత్రం’ను గుర్తుచేసింది. NOV నుంచి రూపాయి 3% బలహీనపడినా ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే ఇది అతి కనిష్ఠమని తెలిపింది.

News January 14, 2025

పండగ రోజు ఏ సినిమాకు వెళ్తున్నారు?

image

సంక్రాంతి పండగ రోజూ అందరూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటారు. ఫ్యామిలీతో సినిమాలకు వెళ్తుంటారు. ఈ సారి సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాలు ‘గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలోకి వచ్చేశాయి. ఏ సినిమా ఎలా ఉందో టాక్ కూడా తెలిసిపోయింది. మరి మీరు ఈరోజు వీటిలో ఏ మూవీకి వెళ్తున్నారు? కామెంట్ చేయండి.